TCS Shares Buy Back | ఇండియన్ ఐటీ జెయింట్ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) ప్రకటించిన షేర్ బైబ్యాక్ ఆఫర్ టైం వచ్చేసింది. ఈ నెల తొమ్మిదో తేదీన మొదలైన షేర్ బై బ్యాక్ ఆఫర్ ఈ నెల 23న ముగుస్తుంది. రూ.18 వేల కోట్ల విలువైన షేర్లను బై బ్యాక్ చేస్తున్నట్లు తెలిపింది. బై బ్యాక్ ఆఫర్ తుది గడువు తేదీ ఈ నెల 23న ఆఫర్లో పాల్గొన్న వారు టెండర్ ఫామ్స్, ఇతర స్పెసిఫైడ్ డాక్యుమెంట్లు, ఫిజికల్ షేర్ సర్టిఫికెట్లు రిజిస్ట్రార్‌కు సమర్పించాల్సి ఉంటుంది.
రూ.18 వేల విలువైన షేర్లతో కూడిన షేర్ల బై బ్యాక్ ఆఫర్‌కు గత జనవరి 12న టీసీఎస్ బోర్డు ఆమోదం తెలిపింది. ఈక్విటీ షేర్ రూ.4,500ను షేర్ ముఖ విలువ రూపాయిపై 4 కోట్ల ఫుల్ పెయిడ్ అప్ ఈక్విటీ షేర్లు బైబ్యాక్ ఆఫర్ చేస్తుంది. వచ్చే ఏప్రిల్ ఒకటో తేదీన స్టాక్ ఎక్స్చేంజీల్లో షేర్ల బై బ్యాక్ కింద దాఖలైన బిడ్ల సెటిల్మెంట్ను పూర్తి చేస్తుంది.
ఇంతకుముందు కూడా టీసీఎస్ పలు దఫాలు షేర్ల బై బ్యాక్‌కు వెళ్లింది. 2020 డిసెంబర్ 8వ తేదీన రూ.16 వేల కోట్ల షేర్ల బైక్ ఓపెన్ చేసి గత ఏడాది జనవరి ఒకటో తేదీన ముగించింది. అంతకుముందు 2017, 2018 ల్లో రెండు వేర్వేరు ఈక్విటీ షేర్ బై బ్యాక్‌లకు వెళ్లింది. ఈ రెండు షేర్ల బై బ్యాక్ విలువ రూ.16 వేల కోట్లు.