TCS Shares Buy Back | దేశంలోనే ఐటీ దిగ్గజంగా పేరొందిన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) షేర్ల బై బ్యాక్ ఆఫర్‌కు భారీ స్పందన లభించింది. రూ.18 వేల కోట్ల విలువైన షేర్లు 5.5 రెట్లు బై బ్యాక్ అయ్యాయి. టీసీఎస్ షేర్ల బై బ్యాక్ బుధవారం ముగుస్తుంది. మంగళవారం ట్రేడింగ్ ముగిసే సమయానికి 220 మిలియన్ల షేర్లకు టెండర్లు దాఖలయ్యాయి. వీటిలో టాటా సన్స్ 40 మిలియన్ల షేర్లను బై బ్యాక్ చేసింది. మొత్తం టాటా సన్స్ ఈక్విటీలో ఇది 1.08 శాతం.
టీసీఎస్ షేర్ బైబ్యాక్ కింద ప్రతి షేర్ రూ.4,700లకు సబ్‌స్క్రైబ్ అయింది. ఇది ప్రస్తుత మార్కెట్ ధరతో పోలిస్తే 21 శాతానికి పై చిలుకే. మంగళవారం స్టాక్ మార్కెట్లలో ట్రేడింగ్ ముగిసేనాటికి టీసీఎస్ షేర్లు రూ.3,701 వద్ద స్థిర పడింది. ఈ నెల తొమ్మిదో తేదీన ప్రారంభమైన టీసీఎస్ షేర్ల బై బ్యాక్.. బుధవారం ముగియనున్నది.
టీసీఎస్ షేర్ల బై బ్యాక్‌లో రిటైల్ ఇన్వెస్టర్లు 14.3 శాతం మంది పాల్గొన్నారని ఎడెల్వైజ్ ఆల్టర్నేటివ్ రీసెర్చ్ పేర్కొంది. ప్రతి ఏడు షేర్లకు ఒక షేర్ బై బ్యాక్ అయింది. నాన్ రిటైల్ ఇన్వెస్టర్లలో ప్రతి 108 షేర్లకు ఒక షేర్ మాత్రమే బై బ్యాక్ అయింది. కానీ, ఇంతకుముందు టీసీఎస్ షేర్ల బై బ్యాక్‌తో పోలిస్తే, స్పందన తగ్గింది. 2020లో రూ.16 వేల కోట్ల విలువైన షేర్ల బ్యై బ్యాక్‌లో రిటైల్ ఇన్వెస్టర్లు 100 శాతం, నాన్ రిటైల్ ఇన్వెస్టర్లు 10 శాతం మంది రియాక్టయ్యారు.