TCS Jobs Scam | నైతిక ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు ఆరు బిజినెస్ అనుబంధ సంస్థలను నిషేధించామని టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) తెలిపింది. సంస్థలోని ఆరుగురు ఉద్యోగులను తొలగించినట్లు ప్రకటించింది. నియామకాల కుంభకోణంపై ఒక ప్రజావేగు ఫిర్యాదు నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు టాటా సన్స్ చైర్ పర్సన్ ఎన్ చంద్రశేఖరన్ గురువారం తెలిపారు.
భవిష్యత్‌లో ఇటువంటి ఉద్యోగ నియామక కుంభకోణాలు పునరావృతం కాకుండా నియామక యాజమాన్య ప్రక్రియను సమీక్షించి పటిష్టం చేస్తామన్నారు ఎన్ చంద్రశేఖరన్. టీసీఎస్ 28వ వార్షిక సర్వసభ్య సమావేశంలో చంద్ర శేఖరన్ ఈ సంగతి చెప్పారు. సంస్థ ఉద్యోగుల్లోనూ నైతిక ప్రవర్తన, సమగ్రత అవసరం అని నొక్కి చెప్పారు.
‘ఏదైనా ఆర్థిక లావాదేవీల విషయమై ప్రతి ఉద్యోగి నైతిక ప్రవర్తన, సమగ్రత కలిగి ఉంటారని కంపెనీ భావించడం చాలా ముఖ్యం. ఎప్పుడైనా, ఎక్కడైనా ఏ ఉద్యోగైనా నైతిక ప్రవర్తన ఉల్లంఘిస్తే నాకు బాధ కలిగిస్తుంది. సంస్థలోని లీడర్లు అంతా ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించాలి. ఇటువంటి ఘటనలు జరిగితే చాలా తీవ్రమైన చర్య తీసుకుంటాం’ అని చంద్రశేఖరన్ హెచ్చరించారు.
ఉద్యోగాలకు ముడుపులు కుంభకోణంలో టీసీఎస్ ఎగ్జిక్యూటివ్‌లు భాగస్వాములయ్యారని ఫిబ్రవరి మార్చిలో టీసీఎస్ యాజమాన్యానికి ఫిర్యాదులు అందాయి. దీనిపై విచారించిన తర్వాత నివేదిక ఆధారంగా ఆరుగురు టీసీఎస్ ఉద్యోగులు, ఆరు నియామక సంస్థలను నిషేధించాం అని చంద్రశేఖరన్ తెలిపారు. అమెరికా ఫిర్యాదుపై విదేశీ దర్యాప్తు సంస్థతో దర్యాప్తు చేస్తామని తెలిపారు.
TCS Job’s Scam | టీసీఎస్‌లో వెలుగులోకి అక్రమాలు.. ఉద్యోగాల పేరిట డబ్బులు వసూల్..?!
TCS | రిక్రూట్మెంట్ ప్రక్రియలో ఎటువంటి స్కాం జరగలేదు: టీసీఎస్