న్యూఢిల్లీ, నవంబర్ 16: టాటా టెక్నాలజీ ఐపీవో ధరల శ్రేణిని రూ.475 నుంచి రూ.500 మధ్యలో నిర్ణయించింది. ఈ నెల 22న ప్రారంభం కానున్న వాటాల విక్రయం 24న ముగియనున్నదని, తద్వారా రూ.3,042 కోట్ల నిధులను సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నది. యాంకర్ పెట్టుబడిదారుల కోసం ఈ నెల 21న నిర్వహించనున్నారు.
2004లో టీసీఎస్ ఐపీవోకి వచ్చిన తర్వాత టాటా గ్రూపు నుంచి వస్తున్న ఐపీవో ఇదే కావడం విశేషం. ఈ ఐపీవోల్లో భాగంగా ఆఫర్ ఫర్ సేల్(ఓఎఫ్ఎస్) రూట్లో 6.08 కోట్ల షేర్లను విక్రయించనున్నారు.