న్యూఢిల్లీ : భారతీయ స్టీల్ దిగ్గజం టాటా స్టీల్ ట్రాన్స్‌జెండర్స్‌కు మెరుగైన అవకాశాలు కల్పించేందుకు ముందుకొచ్చింది. తన వెస్ట్ బొకారో డివిజన్లో హెవీ ఎర్త్ మూవింగ్ మెషీనరీ ఆపరేటర్లు (ట్రైనీ)గా కేవలం ట్రాన్స్జెండర్ల నుంచే దరఖాస్తులు కోరింది. జార్ఱండ్లోని రామ్‌ఘఢ్ వెస్ట్ బొకారో బొగ్గు విభాగంలో హెచ్ఈఎంఎం ట్రైనీ ఆపరేటర్లుగా ట్రాన్స్జెండర్ల నుంచి మాత్రమే అభ్యర్ధుల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోందని టాటా స్టీల్ తన జాబ్ పోస్ట్‌లో పేర్కొంది. మెట్రిక్యులేషన్ ఉత్తీర్ణులై 1981 నుంచి 2003 మధ్య పుట్టినవారి నుంచి దరఖాస్తులను కోరుతున్నామని పేర్కొంది.
అభ్యర్ధులు రాతపరీక్ష, ఇంటర్వ్యూ, ప్రాక్టికల్ ఓరియంటేషన్ పరీక్ష అనంతరం మెడికల్ ఎగ్జామినేషన్‌కు హాజరు కావాల్సి ఉంటుందని తెలిపింది. సంస్ధలో ఎల్జీబీటీ శ్రేణికి సమాన అవకాశాలు ఇచ్చే క్రమంలో టాటా స్టీల్ కొంతకాలంగా చొరవ చూపుతోంది. ఇండియా వర్క్‌ప్లేస్ ఈక్వాలిటీ ఇండెక్స్‌లో టాటా స్టీల్ టాప్ ఎంప్లాయర్స్ జాబితాలో ఉంది. ఎల్జీబీటీ వర్గానికి సమాన అవకాశాలు దక్కేలా చొరవ చూపే సంస్ధలకు ఈ ఇండెక్స్‌లో చోటుదక్కుతుంది.