Tata: టాటా చేతికి ఐఫోన్ల ప్రొడక్షన్.. ? డీల్ విలువ 4 వేల కోట్లు !
Tata : ఇండియాలో మొదటిసారి ఐఫోన్లు ఉత్పత్తి చేయనున్న కంపెనీగా టాటా నిలువనున్నది. కర్నాటకలో ఉన్న విస్ట్రాన్ కార్ప్స్ సంస్థను టాటా కంపెనీ కొనుగోలు చేయనున్నది. అయితే టాటా-విస్ట్రాన్ మధ్య త్వరలో డీల్ జరగనున్నది.
న్యూఢిల్లీ: భారత్లో టాటా(Tata) కంపెనీ ఐఫోన్లు ఉత్పత్తి చేయనున్నది. కర్నాటకలో ఉన్న విస్ట్రాన్ కార్ప్స్ ఫ్యాక్టరీతో టాటా కంపెనీ ఒప్పందం కుదుర్చుకోనున్నది. ఆ ఒప్పందం చివరి దశలో ఉన్నట్లు తెలుస్తోంది. ఆగస్టులో ఆ టేకోవర్ ఉంటుందని భావిస్తున్నారు. కర్నాటకలో ఉన్న విస్ట్రాన్ కంపెనీలో ఐఫోన్ 14 మోడళ్లను అసెంబ్లీ చేస్తుంది. అయితే ఇక నుంచి ఆ విస్ట్రాన్ కంపెనీ కార్యకలాపాలను టాటా కంపెనీ చూసుకోనున్నది. టాటా కంపెనీతో కుదర్చుకున్న డీల్ వల్ల హార్డ్వేర్ ఉత్పత్తిరంగం ప్రతిష్ట పెరగనున్నది.
విస్ట్రాన్ ఫ్యాక్టరీ విలువ సుమారు 4వేల కోట్లు ఉంటుంది. ఇండియాకు 1.8 బిలియన్ల డాలర్ల ఆర్డర్లు ఇచ్చేందుకు యాపిల్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్నది. టాటా-విస్ట్రాన్ డీల్ ద్వారా ప్లాంట్లో సిబ్బందిని పెంచాలని కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
రోహిణి కార్తెను తలపిస్తున్న ఎండలు
ED Charge Sheets | వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసులో ఈడీ 9 ఛార్జీషీట్లు దాఖలు
డీజే ట్రాలీలో పేలిన టపాసులు.. నలుగురికి గాయాలు
Rahul Gandhi | పోలీసుల దాడిలో వినికిడి శక్తి కోల్పోయిన విద్యార్థిని.. ఢిల్లీ పోలీసులపై రాహుల్ గాంధీ ఆగ్రహం
Puri Jagannadh | ‘జార్జ్ క్రిష్’ సెట్స్లో పూరి జగన్నాథ్ సందడి.. శ్రీను వైట్లకు అదిరిపోయే సర్ప్రైజ్!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

