ముంబై : టాటా మోటార్స్ తన టాటా సఫారీ, హారియర్, నెక్సన్ మోడల్ ఎస్‌యూవీలకు జెట్ ఎడిషన్స్ లాంఛ్ చేసింది. బిజినెస్ జెట్స్ ఇన్స్పిరేషన్తో జెట్ ఎడిషన్‌కు ఎక్ల్సూజివ్ ఎక్ట్సీరియర్, ఇంటీరియర్ కలర్ స్కీమ్స్‌తో పాటు అదనపు ఫీచర్లను కంపెనీ జోడించింది. టాటా నెక్సన్ జెట్ ఎడిషన్ రూ 12.13 లక్షల నుంచి 13.43 లక్షల వరకూ అందుబాటులో ఉండగా, హారియర్ జెట్ ఎడిషన్ ప్రారంభ ధర 20.9 లక్షలు కాగా హైఎండ్ మోడల్ 22.2 లక్షలకు లభిస్తుంది.
టాటా సఫారి జెట్ ఎడిషన్ రూ 21.45 లక్షల నుంచి రూ 22.65 లక్షల మధ్య అందుబాటులో ఉంటుంది. టాటా జెడ్ ఎడిషన్స్ సిక్స్, సెవెన్ సీటర్ వెర్షన్స్‌లో లభిస్తాయి. టాటా జెట్ ఎడిషన్ న్యూ ఎక్ట్సీరియర్ కలర్, స్టార్లైట్గా పిలిచే డ్యూయల్ టోన్ ఎర్తీ బ్రాంజ్, ప్లాటినం సిల్వర్ రూఫ్‌ను కలిగిఉంటుంది. అన్ని ఎస్‌యూవీల అలాయ్ వీల్స్ జెట్ బ్లాక్‌లో కస్టమర్లను ఆకట్టుకుంటాయి.
కారు లోపలిభాగంలో న్యూ టెక్నో స్టీల్ బ్రాంజ్ ఫినిష్‌తో కూడిన డ్యాష్‌బోర్డు ఏర్పాటైంది. ఇతర క్యాబిన్ ఫీచర్లు డోర్లు, ఫ్లోర్ కన్సోల్స్‌పై బ్రాంజ్ యాక్సెంట్ ఉంటుంది. ఫ్రంట్ సీట్ హెడ్‌రెస్ట్స్ జెట్ ఎంబ్రాయిడర్డ్తో ఆకట్టుకుంటాయి. ఇక జెట్ ఎడిషన్‌లో డ్రైవర్ డ్రౌజీనెస్ అలర్ట్, ప్యానిక్ బ్రేక్ అలర్ట్ వంటి సేఫ్టీ ఫీచర్లున్నాయి. బిజినెస్ జెట్‌లో ఉండే తరహాలో లగ్జరీ సీట్ల అమరిక ఉంటుంది. మూడు వరసల్లో యూఎస్బీ టైప్-సీ చార్జింగ్ పోర్ట్స్ ఉంటాయి.