న్యూఢిల్లీ, సెప్టెంబర్ 12: దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఈవీ మాడళ్లలో ఒకటైన పంచ్ ఈవీ ధరను మరోసారి పెంచింది టాటా. ఈ మాడల్ ధరను రూ.10 వేల నుంచి రూ.20 వేల వరకు సవరిస్తున్నట్టు తాజాగా ప్రకటించింది. దీంతో ఈ కారు ధర రూ.9.79 లక్షల నుంచి రూ.12.99 లక్షల మధ్యలోకి చేరుకున్నది. ఈ ఏడాది ఫిబ్రవరిలో మార్కెట్లోకి విడుదల చేసినప్పుడు ఈ కారు ధర రూ.9.69 లక్షలుగా ఉండేది.
వీటిలో 30 కిలోవాట్ల బ్యాటరీ కలిగిన మాడల్ ధరను రూ.10 వేలు పెంచిన సంస్థ.. 40 కిలోవాట్ల బ్యాటరీ మాడల్‌ను రూ.20 వేలు సవరించింది. సింగిల్చార్జింగ్తో 30 కిలోవాట్ల బ్యాటరీ మాడల్ 375 కిలోమీటర్ల మైలేజీ ఇవ్వనుండగా, 40 కిలోవాట్ల బ్యాటరీ మాడల్ 468 కిలోమీటర్లు ప్రయాణించనున్నది. ఎక్స్‌యూవీ 3ఎక్స్వో ఈవీ, సిట్రాయిన్ ఈసీ3, ఎంజీ కొమ్మెట్ ఈవీ, విండ్సర్ ఈవీలకు పంచ్ గట్టి పోటీనివ్వనున్నది.