Tata Nexon | దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న కంపాక్ట్ ఎస్యూవీ (Compact SUV) కారు టాటా నెక్సాన్ (Tata Nexon). త్వరలో ఎస్యూవీ – కూపే తరహా కారు కర్వ్ ఆవిష్కరిస్తున్న నేపథ్యంలో టాటా నెక్సాన్ కారు 1.2 లీటర్ల పెట్రోల్ ఇంజిన్, 1.5 లీటర్ల డీజిల్ ఇంజిన్ వేరియంట్ కార్లపై టాటా మోటార్స్ రాయితీ ఆఫర్ చేసింది. అన్ని రకాల నెక్సాన్ కార్లపై రూ.లక్ష వరకూ డిస్కౌంట్ అందిస్తున్నట్లు తెలిపింది. ఈ నెలాఖరు వరకూ ఈ డిస్కౌంట్ అందుబాటులో ఉంది. స్మార్ట్ (Smart), స్మార్ట్ (ఓ) (Smart (O), స్మార్ట్ + (Smart +), స్మార్ట్ + ఎస్ (Smart + S), ప్యూర్ (Pure) ప్యూర్ ఎస్ (Pure S), క్రియేటివ్ (Creative), క్రియేటివ్ + (Creative +), క్రియేటివ్ + ఎస్ (Creative S), ఫియర్ లెస్ (Fearless), ఫియర్ లెస్ ఎస్ (Fearless S), ఫియర్ లెస్+ (Fearless +) వేరియంట్లపై ఈ డిస్కౌంట్ పొందొచ్చు. ఇక నెక్సాన్.ఈవీ వేరియంట్ కార్లపై గరిష్టంగా రూ.60 వేల వరకూ డిస్కౌంట్ ఆఫర్ చేసింది టాటా మోటార్స్.
నెక్సాన్ కార్లపై రాష్ట్రాల వారీగా డిస్కౌంట్లలో తేడా ఉంటుందని టాటా మోటార్స్ తెలిపింది. ఆసక్తి గల కార్ల ప్రేమికులు తమకు సమీపంలోని డీలర్ల వద్దకు వెళ్లి తెలుసుకోవచ్చు. స్మార్ట్ (ఓ) (Smart (O), స్మార్ట్+ (Smart +), స్మార్ట్ + ఎస్ (Smart + S) వేరియంట్లపై మాత్రం డిస్కౌంట్లను మినహాయిస్తున్నట్లు టాటా మోటార్స్ వెల్లడించింది. స్మార్ట్ (పెట్రోల్) వేరియంట్ మీద రూ.16 వేలు, స్మార్ట్ + (పెట్రోల్) , ప్యూర్ (డీజిల్) మీద రూ.20 వేలు, ప్యూర్ (పెట్రోల్), ప్యూర్ ఎస్ (డీజిల్) వేరియంట్లపై రూ.30 వేల డిస్కౌంట్ తెలిపింది.
స్మార్ట్ + ఎస్ (పెట్రోల్), ప్యూర్ ఎస్ (పెట్రోల్) వేరియంట్లపై రూ.40 వేలు, క్రియేటివ్ (పెట్రోల్, డీజిల్), ఫియర్ లెస్ (పెట్రోల్, డీజిల్), ఫియర్ లెస్ ఎస్ (పెట్రోల్, డీజిల్), ఫియర్ లెస్+ (పెట్రోల్, డీజిల్) వేరియంట్లపై రూ.60 వేల వరకూ డిస్కౌంట్ లభిస్తుంది. క్రియేటివ్ (పెట్రోల్, డీజిల్) వేరియంట్లపై రూ.80 వేలు, క్రియేటివ్ + ఎస్ (పెట్రోల్, డీజిల్) వేరియంట్లపై రూ.లక్ష వరకూ డిస్కౌంట్ అందుబాటులో ఉంది. ఈ డిస్కౌంట్లు ఆగస్టు 31 వరకూ అమల్లో ఉంటాయి.