Tata Nexon EV MAX XZ+ LUX | ప్రముఖ దేశీయ కార్ల తయారీ సంస్థ టాటా మోటార్స్.. భారత్ మార్కెట్లోకి నెక్సాన్ ఈవీ మాక్స్ ఎక్స్జడ్+ లక్స్ (Nexon EV MAX XZ+ LUX) ఆవిష్కరించింది. ఈ కారు ధర రూ.18.79 లక్షలుగా ఉంటుంది. 7.2 కిలోవాట్ల ఏసీ ఫాస్ట్ చార్జర్ వేరియంట్ రూ.19.29 లక్షలు పలుకుతుంది. బిగ్గర్ హార్మన్ సోర్స్డ్ 10.25-అంగుళాల హెచ్డీ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ విత్ ఓవర్180 వాయిస్ కమాండ్స్, ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ ప్లే స్టాండర్డ్ ఫీచర్ అలాంగ్ విత్ న్యూ యూజర్ ఇంటర్ ఫేస్ (యూఐ) ఫీచర్లు కలిగి ఉంటుంది.
టాటా నెక్సాన్ ఈవీ మాక్స్ ఎక్స్జడ్ (Nexon EV MAX XZ+ LUX) (3.3 కిలోవాట్ల ఏసీ చార్జర్) కార్ల బుకింగ్స్ శుక్రవారం నుంచి ప్రారంభమయ్యాయి. ఆసక్తి కల వారు దేశవ్యాప్తంగా కంపెనీ ఆథరైజ్డ్ డీలర్ల వద్ద బుక్ చేసుకోవచ్చు.
టాటా నెక్సాన్ ఈవీ మాక్స్ ఎక్స్జడ్ (Nexon EV MAX XZ+ LUX) (3.3 కిలోవాట్ల ఏసీ చార్జర్)తోపాటు 7.2 కిలోవాట్ల ఏసీ ఫాస్ట్ చార్జర్ వేరియంట్ కార్లలో టీఎఫ్టీ హై రిజొల్యూషన్ హెచ్డీ డిస్ ప్లే, హెచ్డీ రేర్ వ్యూ కెమెరా, ఎన్హ్యాన్స్డ్ ఆడియో పర్ ఫార్మెన్స్ విత్ షార్ప్ నోట్స్ అండ్ ఎక్స్ టెండెడ్ బేస్ పెర్పార్మెన్స్, ఆరు భాషల్లో వాయిస్ అసిస్టెంట్ (ఇంగ్లిష్, హిందీ, బెంగాలీ, తమిళం, తెలుగు, మరాఠీ) ఫీచర్ ఉంటుంది.
జిప్ట్రోన్ టెక్నాలజీతో రూపుదిద్దుకున్న టాటా నెక్సాన్ ఈవీ వేరియంట్ కార్లు ఇప్పటికే 45 వేలకు పైగా అమ్ముడు పోయాయి. దేశంలో బెస్ట్ సెల్లింగ్ ఎలక్ట్రిక్ ఎస్యూవీ కారుగా నిలిచింది. దేశవ్యాప్తంగా 188 నగరాల పరిధిలో 270కిపైగా డీలర్లతో కూడిన టాటా నెట్ వర్క్ ద్వారా నెక్సాన్ ఈవీ కార్లు అమ్ముడయ్యాయి.
నెక్సాన్ ఈవీ ప్రైమ్ —– ధర (రూ.లక్షల్లో)
ఎక్స్ఎం ————- 14.49
ఎక్స్జడ్ ————- 15.99
ఎక్స్జడ్ + లక్స్ —- 16.99
డార్క్ ఎక్స్జడ్+ —— 16.19
డార్క్ ఎక్స్జడ్+ లక్స్ — 17.19
నెక్సాన్ ఈవీ మాక్స్ వేరియంట్ ———————— ధర (రూ.లక్షల్లో)
ఎక్స్ఎం ————————————————– 16.49
ఎక్స్ఎం 7.2 కేడబ్ల్యూ ఏసీ ఫాస్ట్ చార్జర్ —————- 16.99
ఎక్స్జడ్ ————————————————- 17.49
ఎక్స్జడ్ 7.2 కేడబ్ల్యూ ఏసీ ఫాస్ట్ చార్జర్ —————- 17.99
ఎక్స్ జడ్ + లక్స్ —————————————- 18.79
ఎక్స్ జడ్ + లక్స్ 7.2 కేడబ్ల్యూ ఏసీ ఫాస్ట్ చార్జర్——– 19.29
డార్క్ ఎక్స్జడ్ + లక్స్ ——————————— 19.04
డార్క్ ఎక్స్జడ్ + లక్స్ 7.2 కేడబ్ల్యూ ఏసీ ఫాస్ట్ చార్జర్– 19.54