Tata Motors | ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ టాటా మోటార్స్ (Tata Motors) తన వాణిజ్య వాహనాల ధరలు పెంచుతున్నట్లు ప్రకటించింది. జూలై ఒకటో తేదీ నుంచి వాణిజ్య వాహనాల ధరలు రెండు శాతం పెంచుతున్నామని బుధవారం తెలిపింది. కమోడిటీ ధరలు పెరిగిపోవడంతో వాహనాల ధరలు పెంచక తప్పలేదని పేర్కొంది. దేశీయ ఆటోమొబైల్ రంగంలో కీలక పాత్ర పోషిస్తున్న టాటా మోటార్స్.. అన్ని రకాల వాణిజ్య వాహనాల ధరలు పెంచుతున్నట్లు స్పష్టం చేసింది. వేరియంట్లు, మోడల్స్ వారీగా ధరల పెంపులో తేడా ఉంటుందని వివరించింది.
టాటా మోటార్స్ తన వాణిజ్య వాహనాల ధరలు పెంచడం ఇది రెండోసారి. ఇంతకుముందు ఏప్రిల్ లోనూ ఇన్పుట్ కాస్ట్ తగ్గించుకోవడానికి టాటా మోటార్స్ వాణిజ్య వాహనాల ధరలు పెంచేసింది. ట్రక్కులు, బస్సులు వరకూ పలు రకాల వాణిజ్య వాహనాలను టాటా మోటార్స్ తయారు చేస్తోంది.