Tata Motors | ప్రముఖ దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం ‘టాటా మోటార్స్’ తన ‘ఫెస్టివల్ ఆఫ్ కార్స్’ క్యాంపెయిన్ ప్రారంభించింది. ప్రస్తుత పండుగల సీజన్ సందర్భంగా అద్బుతమైన ఆఫర్లు ప్రకటించింది. పాపులర్ కార్లు, ఎస్యూవీలపై రూ.2.05 లక్షల వరకూ ధరలు తగ్గించింది. ఈ ఫెస్టివల్ ఆఫర్లు వచ్చేనెల 31 వరకూ అమల్లో ఉంటాయి. అన్ని రకాల పెట్రోల్, డీజిల్, సీఎన్జీ వేరియంట్ కార్లపైనా ధరల తగ్గింపు ఉంటుందని టాటా మోటార్స్ తెలిపింది.
టాటా టియాగో – రూ.4.99 లక్షలు
టాటా ఆల్ట్రోజ్ – రూ.6.49 లక్షలు
టాటా నెక్సాన్ – రూ.7.99 లక్షలు
టాటా హారియర్ – రూ.14.99 లక్షలు
టాటా సఫారీ – రూ.15.49 లక్షలు
ఫెస్టివల్ ఆఫర్లకు తోడుగా డీలర్ల వద్ద ఎక్స్చేంజ్ ఆఫర్ కింద రూ.45 వేల వరకూ డిస్కౌంట్ ప్రకటించింది టాటా మోటార్స్. 2023తో పోలిస్తే ఆగస్టు కార్ల విక్రయాలు 4.5 శాతం పడిపోవడంతో టాటా మోటార్స్ తన పాపులర్ మోడల్ కార్లపై ధరలు తగ్గించడం ప్రాధాన్యం సంతరించుకున్నది. ఏప్రిల్ నుంచి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వరుసగా మూడు నెలలుగా కార్ల విక్రయాలు తగ్గుతూ వచ్చాయి. గత నెలలో మారుతి సుజుకి కార్ల విక్రయాలు 8.5 శాతం, హ్యుండాయ్ 12.9 శాతం, టాటా మోటార్స్ 2.7 శాతం సేల్స్ తగ్గాయి.