న్యూఢిల్లీ, అక్టోబర్ 6: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్వితీయ త్రైమాసికంలో తమ గ్లోబల్ హోల్‌సేల్ అమ్మకాలు 7 శాతం వృద్ధితో 3.42 లక్షల యూనిట్లకు పెరిగినట్టు టాటా మోటార్స్ ప్రకటించింది. ఈ ఏడాది జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో టాటా మోటార్స్ వాణిజ్య వాహనాలు, టాటా దేవూ వాహనాల గ్లోబల్ హోల్‌సేల్ అమ్మకాలు 3 శాతం పెరిగి 1,06,620 యూనిట్లకు పెరిగినట్టు కంపెనీ ప్రకటన తెలిపింది.
అయితే ఎలక్ట్రిక్ వాహనాలతో సహా పాసింజర్ వాహనాల గ్లోబల్ అమ్మకాలు 3 శాతం తగ్గి, 1,38,939 యూనిట్ల వద్ద నిలిచాయి. జాగ్వర్, ల్యాండ్‌రోవర్ గ్లోబల్ హోల్‌సేల్స్ 29 శాతం వృద్ధిచెంది 96,917 యూనిట్లకు చేరాయి. ఈ త్రైమాసికంలో 13,560 జాగ్వర్ వాహనాలు, 83,257 ల్యాండ్ రోవర్ వాహనాల్ని విక్రయించినట్టు టాటా మోటార్స్ తెలిపింది.