న్యూఢిల్లీ, అక్టోబర్ 4: ఎస్యూవీ విభాగంలో ఉన్న అవకాశాలను అందిపుచ్చుకోవడానికి టాటా మోటర్స్..సరికొత్త ‘పంచ్’ మోడల్‌ను పరిచయం చేసింది. ఈ నెల 20న విడుదల చేయనున్న ఈ మోడల్ ముందస్తు బుకింగ్‌లను ప్రారంభించింది. ఇందుకోసం దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రిటైల్ అవుట్లెట్లలో రూ.21 వేలు చెల్లించి ముందస్తు బుకింగ్ చేసుకోవచ్చునని సూచించింది. 1.2 లీటర్ల పెట్రోల్ ఇంజిన్ కలిగిన ఈ మోడల్..మాన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్లలో లభించనున్నది.