Car Rates Hike | ఫెస్టివ్ సీజన్ ముగియడంతో టాటా మోటార్స్ (Tata Motors) సహా పలు కార్ల తయారీ సంస్థలు కార్ల ధరలు పెంచేశాయి. టాటా మోటార్స్ ఎంపిక చేసిన మోడల్.. వేరియంట్‌ను బట్టి 0.9 శాతం వరకు ధరలు పెంచేసింది. ఒకవైపు కార్ల ధరలు పెంచేసి, మరోవైపు కొన్ని మోడల్స్‌పై ఇన్సెంటివ్‌లు ప్రకటించాయి. కానీ, టాప్ మోడల్స్ కార్లపై రాయితీలు ఇవ్వక పోవడం గమనార్హం.
పెరిగిన ధరలు తక్షణం (2022 నవంబర్ 7) అమల్లోకి వచ్చాయి. కార్ల తయారీలో పెరిగిన ఇన్పుట్ కాస్ట్ తగ్గించుకోవడానికి ధరలు పెంచక తప్పలేదని టాటా మోటార్స్ ప్రకటించింది. టియాగో, పంచ్, నెక్సాన్, హారియర్, సఫారీ వంటి పాపులర్ మోడల్ కార్లను టాటా మోటార్స్ విక్రయిస్తున్నది.
చెక్ మాన్యుఫాక్చరర్ స్కోడా, జపాన్ వారి టయోటా, దక్షిణ కొరియా ఆటో మేజర్ కియా మోటార్స్ సైతం ఇటీవల భారత్‌లో కార్ల ధరలు పెంచేశాయి. స్కోడా కుషక్, కియా కరెన్స్, టయోటా ఫార్చూనర్ కార్ల ధరలు పెరిగాయి. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది అక్టోబర్‌లో టాటా సఫారీ ఎస్యూవీ సేల్స్ 5.11 శాతం తగ్గాయి. గతేడాది సఫారీ సేల్స్ 78,335 యూనిట్లకు పడిపోయాయి.
సెమీ కండక్టర్ల కొరత, సప్లయ్ చైన్ సమస్యతో సతమతం అవుతున్న కార్ల తయారీ సంస్తలు కొన్ని ఎంపిక చేసిన మోడల్ కార్ల సేల్స్ పెంపునకు అధిక డిస్కౌంట్లు ఆఫర్ చేశాయి. తక్కువ సేల్స్ జరుగుతున్న మారుతి ఎక్స్ఎల్ 6పై డిస్కౌంట్లు ఆఫర్ చేయలేదు. కానీ టాప్ సెల్లింగ్ కార్లు ఆల్టో, వాగన్ఆర్లపై ఆఫర్లు అందుబాటులోకి తెచ్చింది.
ఎంవీపీ సెగ్మెంట్‌తో పోలిస్తే ఎస్‌యూవీలు, మినీ వ్యాన్లు, హ్యాచ్‌బ్యాక్ మోడల్ కార్లపై అధిక ఇన్సెంటివ్‌లు ఉన్నాయి. ఇక ఫోక్స్‌వాగన్, స్కోడా, హోండా, టయోటాలపై సగటు డిస్కౌంట్లు అందుబాటులో ఉండగా, టాటా మోటార్స్ కార్లపై అధిక ఇన్సెంటివ్‌లు లభిస్తున్నాయి. గత నెలలో మొదలైన డిస్కౌంట్లు ఈ ఏడాది చివరి వరకు కొనసాగుతాయి. ఆయా సంస్థల వద్ద ఔట్ గోయింగ్ మోడల్స్ సేల్స్ పెంపుపైనే కార్ల తయారీ సంస్థలు దృష్టి కేంద్రీకరించాయి.
మారుతి బ్రెజా (Brezza), టాటా పంచ్ (Punch), హ్యుండాయ్ వెన్యూ (Venue), కియా సెల్టోస్ (Seltos), కియా సొనెట్ (Sonet), కియా కరెన్ (Caren), మారుతి ఎర్టిగా (Ertiga), మహీంద్రా స్కార్పియో (Scorpio), మహీంద్రా ఎక్స్‌యూవీ 700 (XUV 700), హ్యుండాయ్ క్రెటా (Creta).