న్యూఢిల్లీ, జనవరి 13 : దేశీయ మార్కెట్‌కు నయా పంచ్ మాడల్‌ను పరిచయం చేసింది టాటా మోటర్స్ ప్యాసింజర్ వెహికల్. ఎస్యూవీ విభాగాన్ని మరింత బలోపేతం చేయడంలో భాగంగా విడుదల చేసిన ఈ కారు రూ.5.59 లక్షల నుంచి రూ.10.54 లక్షల గరిష్ఠ ధరతో లభించనున్నది. ప్రపంచంలో తొలిసారిగా ట్విన్-సిలిండర్ ఐసీఎన్జీ టెక్నాలజీతో ఆటోమేటిక్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ కలిగిన మాడల్ విడుదల చేయడం విశేషం.
5-స్టార్ భారత్ ఎన్సీఏపీ సేఫ్టీ రేటింగ్ కలిగిన ఈ మాడల్‌ను ఐటర్బో ఇంజిన్, 65 వాట్ల టైప్-సీ యూఎస్బీ చార్జర్, రెయిన్ సెన్సింగ్ వైపర్స్, 26 సెంటీమీటర్ల హెచ్డీ ఇన్ఫోటైన్మెంట్, 360 డిగ్రీల హెచ్డీ సరౌండ్ సిస్టమ్, ఆటోమేటిక్ టెంపరేచర్ కంట్రోల్, స్మార్ట్ డిజిటల్ స్టీరింగ్ వీల్, ఎయిర్-ఫ్యూరిఫైర్ వంటి ఫీచర్స్ ఉన్నాయి. 2021లో పంచ్‌ను విడుదల చేసిన సంస్థ.. 7 లక్షలకు పైగా కస్టమర్లు ఉన్నారు.