న్యూఢిల్లీ, ఆగస్టు 4: తమ పాపులర్ మోడల్ టియాగో కార్ల శ్రేణిని టాటా మోటర్స్ విస్తరించింది. సరికొత్తగా టియాగో ఎన్ఆర్జీ మోడల్‌ను మార్కెట్లోకి విడుదల చేసినట్లు బుధవారం సంస్థ ప్రకటించింది. ఢిల్లీ ఎక్స్‌షోరూం ప్రకారం దీని ప్రారంభ ధర రూ.6.57 లక్షలు. ఈ న్యూ స్పోర్టీ వెర్షన్ హచ్బ్యాక్కు మరింత పెద్ద టైర్లు, బాడీ క్లాడింగ్, రూఫ్ రెయిల్స్‌తో ఎస్యూవీ లుక్‌ను ఇచ్చామని ఈ సందర్భంగా ఓ ప్రకటనలో టాటా మోటర్స్ తెలిపింది. దేశీయ మార్కెట్లో ఇప్పటిదాకా దాదాపు 3.5 లక్షల టియాగో కార్లు అమ్ముడైయ్యాయి.