Tata Motors | టాటా మోటార్స్ తన కస్టమర్లకు ఈజీ ఫైనాన్స్ సొల్యూషన్స్ అందించేందుకు ముందుకు వచ్చింది. ఇందుకోసం ఈఎస్ఏఎఫ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుతో చేతులు కలిపింది. ప్రారంభంలో స్మాల్ కమర్షియల్ వెహికల్స్, లైట్ కమర్షియల్ వెహికల్స్ వరకూ ఈఎస్ఏఎఫ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు రుణ పరపతి కల్పిస్తుంది. ఇందుకోసం టాటా మోటార్స్, ఈఎస్ఏఎఫ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు అవగాహనా ఒప్పందంపై సంతకాలు చేశాయి.
‘ఈఎస్ఏఎఫ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుతో తమ ఒప్పందంతో తమ కస్టమర్లకు నిరంతరం ఫైనాన్సింగ్ సొల్యూషన్స్ అందుబాటులోకి వస్తాయని, దేశంలోని మారుమూల ప్రాంతాలకు మా నెట్ వర్క్ విస్తరిస్తుంది’ అని టాటా మోటార్స్ వైస్ ప్రెసిడెంట్, బిజినెస్ హెడ్ వినయ్ పట్నాయక్ చెప్పారు. తమ రెండు సంస్థల మధ్య ఒప్పందంతో ఒక టన్ను నుంచి 55 టన్నులు, 10 సీట్ల నుంచి 51 సీట్లతో ప్రజా మొబిలిటీ సొల్యూషన్స్ అందించే స్మాల్ కమర్షియల్ వెహికల్స్, పికప్స్, ట్రక్కులు, బస్సుల విక్రయంతో ఉపాధి అవకాశాలు మెరుగవుతాయి.