ముంబై, ఫిబ్రవరి 2: దేశీయ ఆటోమొబైల్ దిగ్గజాల్లో ఒకటైన టాటా మోటర్స్ విశ్లేషకుల అంచనాలకుమించి రాణించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికానికిగాను సంస్థ రూ.7,100 కోట్ల నికరలాభాన్ని గడించింది. అంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.3,043 కోట్ల లాభంతో పోలిస్తే రెండింతలు పెరిగినట్టు సంస్థ వెల్లడించింది. సమీక్షకాలంలో కంపెనీ కన్సాలిడేటెడ్ ఆదాయం ఏడాది ప్రాతిపదికన 25 శాతం అధికమై రూ.1,10,600 కోట్లు ఆర్జించింది.
వాహన విభాగాలన్ని రాణించడం వల్లనే మూడో త్రైమాసికపు లాభాలు రెండురెట్లు పెరిగాయి. పండుగ సీజన్ కావడంతో వాహనాలకు డిమాండ్ ఊపందుకోవడం, నూతన వాహనాలను విడుదల చేయడం కూడా కలిసొచ్చింది. గత త్రైమాసికంలో నికరంగా రూ.9,500 కోట్ల అప్పును తగ్గించుకోలిగాం. గత ఆరు త్రైమాసికాలుగా నిలకడైన వృద్ధిని సాధిస్తున్నాం.
– బీ బాలాజీ, టాటా మోటర్స్ గ్రూపు సీఎఫ్వో