నూఢిల్లీ, మే 24: టాటా మోటర్స్‌ను విడగొట్టే ప్రతిపాదనతో దీర్ఘకాలికంగా వాటాదారులకు లాభం చేకూరనున్నదని కంపెనీ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ వ్యాఖ్యానించారు. కంపెనీ 80వ వాటాదారుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. టాటా మోటర్స్‌ను రెండు సంస్థలుగా విడగొట్టి కమర్షియల్ వాహనాలు, ప్యాసింజర్ వాహన విభాగాలుగా విడగొట్టి స్టాక్ మార్కెట్లో లిస్ట్ చేయాలనుకుంటున్నట్టు చెప్పారు.
ఈ ప్రతిపాదనకు ఇప్పటికే వాటాదారులు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. దీంతో ఈ ఏడాది రెండో అర్థభాగం నాటికి టాటా మోటర్స్ రెండు సంస్థలుగా మారబోతున్నది. వ్యాపార వ్యూహాత్మకంలో భాగంగా పలు సంస్థలను విడగొట్టాలని నిర్ణయించినట్టు, దీంతో గ్రూపు ఆర్థికంగా బలోపేతం కావడంతోపాటు వాటాదారులకు లబ్ధిచేకూరనున్నదని ఆయన వ్యాఖ్యానించారు.