న్యూఢిల్లీ, మార్చి 7: టాటా మోటర్స్ మరోసారి తన కమర్షియల్ వాహన ధరలను పెంచబోతున్నట్టు ప్రకటించింది. వచ్చే నెల నుంచి అమలులోకి వచ్చేలా కమర్షియల్ వాహన ధరలను రెండు శాతం వరకు సవరిస్తున్న తెలిపింది. ఉత్పత్తి వ్యయం అధికమవడం వల్లనే వాహన ధరలు పెంచాల్సి వస్తున్నదని తెలిపింది. దీంతో కమర్షియల్ విభాగానికి చెందిన ఆయా మాడళ్లను బట్టి ధరలు పెరగనున్నాయని వెల్లడించింది.