Tata Motors Bumper Offer | టాటా మోటార్స్ కార్లకు క్రమంగా గిరాకీ పెరుగుతున్నది. మొత్తం కార్ల విక్రయాల్లో టాటా మోటార్స్ సేల్స్ గణనీయస్థాయిలో పెరిగాయి. ఈ నెలలోనూ కార్ల విక్రయాల్లో సరికొత్త రికార్డు నెలకొల్పాలని తలపోస్తున్నది టాటా మోటార్స్. అందుకోసం తన కస్టమర్లకు భారీ మొత్తంలో డిస్కౌంట్లు ఆఫర్ చేస్తున్నది. హోలీ పండుగ నేపథ్యంలో క్యాష్ డిస్కౌంట్‌తోపాటు పలు రాయితీలు అందిస్తున్నది. గత నెలలోనూ ఎంపిక చేసిన మోడల్ కార్లపై ఆఫర్ ప్రకటించడంతో సేల్స్‌లో రికార్డు నమోదైంది. ఈ నెలలోనూ టాటా టైగోర్, టియాగో, హ్యారియర్ కార్లను కొనుగోలు చేసేవారికి వివిధ రకాల ఆఫర్లు అందిస్తున్నది. ఆ ఆఫర్లేంటో చూద్దాం..
టాటా నెక్సాన్ కారుకు డిమాండ్ పెరిగిపోయింది. దీన్ని నాలుగు వేరియంట్లలో ఆవిష్కరించింది. దీనిపై గరిష్ఠంగా రూ.25 వేల డిస్కౌంట్ ఇస్తున్నది. కార్పొరేట్ ఆఫర్ రూపంలో రూ.5000 తగ్గించేసింది. ఈ కారు ధర రూ.7.39 లక్షల నుంచి రూ.13.73 లక్షల మధ్య పలుకుతున్నది. మార్చి ఆఫర్లో భాగంగా ఎంవై 2021 మోడల్ కారుపై క్యాష్ డిస్కౌంట్ రూపేణా రూ.10 వేల క్యాష్ డిస్కౌంట్ ఇస్తున్నది. ఇది ఎక్స్‌జడ్ ట్రిమ్ మోడల్‌కు ఈ డిస్కౌంట్ వర్తిస్తుంది. అదనంగా కార్పొరేట్ ఆఫర్ కింద రూ.3000 డిస్కౌంట్ ఇస్తున్నది.
దేశంలోనే అత్యంత పాపులర్ ఎస్యూవీ కారు టాటా హ్యారియర్. దీనిపై అత్యధికంగా రూ.85 వేల డిస్కౌంట్ ప్రకటించింది. 2021 హ్యారియర్ కారుకు రూ.60 వేల డిస్కౌంట్ ఆఫర్ ఉంది. క్యాష్ డిస్కౌంట్ రూ.20 వేలు, ఎక్స్చేంజ్ ఆఫర్ రూ.40 వేల వరకు లభిస్తుంది. టాటా హ్యారియర్ ధరలు రూ.14.49 లక్షల నుంచి రూ.21.70 లక్షల మధ్య పలుకుతున్నాయి. త్వరలో ఎలక్ట్రిక్ కారుగా టాటా పంచ్ కారు తక్కువ ధరకే మార్కెట్లోకి రాబోతున్నది.
టాటా ఆల్ట్రోజ్ దేశంలోనే బెస్ట్ సెల్లింగ్ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ కారు. దీనిపై రూ.10వేల డిస్కౌంట్, టర్బో పెట్రోల్ ఇంజిన్ కారుపై రూ.10 వేలు, పెట్రోల్ ఇంజిన్ కారుపై రూ.7500 అందిస్తున్నది. మారుతి సుజుకి బాలెనో, హ్యుండాయ్ ఐ20 మోడల్ కార్లతో ఆల్ట్రోజ్ పోటీ పడుతున్నది.
టాటా టైగోర్ కారు రూ.35 వేల డిస్కౌంట్ ఇస్తున్నది. అందులో 2021 మోడల్ కారుకు రూ.25 వేలు, 2022 మోడల్‌కు రూ.20 వేల ఎక్స్చేంజ్ ఆఫర్ కల్పించింది. కార్పొరేట్ డిస్కౌంట్ కింద రూ.10 వేలు తగ్గించారు. దీని ధర రూ.5.79 లక్షల నుంచి రూ.8.41 లక్షల మధ్య పలుకుతున్నది. టాటా టైగోర్ కారు కొనుగోలుపై రూ.30 వేల ఆఫర్ అందిస్తున్నది కార్పొరేట్ డిస్కౌంట్ కింద రూ.5000 ఆఫర్ చేసింది. టియాగో మోడల్ కారుపై అత్యధికంగా రూ.30 వేల డిస్కౌంట్ లభిస్తుంది. ఎక్స్‌జడ్ ట్రిమ్, హయ్యర్ వేరియంట్లకు కూడా వర్తిస్తుంది.