Gold Imports | బంగారానికి సుంకాల పోటు.. దేశంలోకి 70 శాతం క్షీణించిన దిగుమతులు
కస్టమ్స్ సుంకం పెంపు నేపథ్యంలో దేశంలోకి బంగారం దిగుమతులు భారీగా పడిపోయాయి. దాదాపు 70 శాతం క్షీణించి 25-30 టన్నులకు పరిమితమైనట్టు గురువారం సంబంధిత అధికారి ఒకరు తెలిపారు.
న్యూఢిల్లీ, జూన్ 18: కస్టమ్స్ సుంకం పెంపు నేపథ్యంలో దేశంలోకి బంగారం దిగుమతులు భారీగా పడిపోయాయి. దాదాపు 70 శాతం క్షీణించి 25-30 టన్నులకు పరిమితమైనట్టు గురువారం సంబంధిత అధికారి ఒకరు తెలిపారు. విదేశాల నుంచి దేశంలోకి వచ్చే పసిడి, వెండిపై గత నెల 13న దిగుమతి సుంకాన్ని 15 శాతానికి మోదీ సర్కార్ పెంచిన విషయం తెలిసిందే. అంతకుముందు ఇది 6 శాతంగానే ఉండేది. ఈ క్రమంలోనే గడిచిన నెల రోజుల్లో ఆయా దేశాల నుంచి భారత్కు దిగుమతైన పుత్తడి 25-30 టన్నులుగానే నమోదైనట్టు సదరు అధికారి చెప్పారు. మునుపు ఇది 75-100 టన్నులుగా ఉండేదని గుర్తుచేశారు.
తగ్గిన పుత్తడి, వెండి ధరలు
బంగారం, వెండి ధరలు మరింత తగ్గుముఖం పట్టాయి. గురువారం న్యూఢిల్లీలో 24 క్యారెట్ (99.9 స్వచ్ఛత) 10 గ్రాముల పుత్తడి రేటు రూ.960 దిగి రూ.1,53,440గా ఉన్నది. వెండి ధర రూ.6,660 పడిపోయి రూ.2,48,740కి పరిమితమైంది. ఇక హైదరాబాద్లో తులం 22 క్యారెట్ (99.5 స్వచ్ఛత) బంగారం విలువ రూ.1,450 దిగి రూ.1,37,050గా ఉన్నది. గ్లోబల్ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ 4,266.47 డాలర్లు, సిల్వర్ 68.17 డాలర్లు పలికింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Free Data Engineering Course | నిరుద్యోగ యువతకు శుభవార్త.. 90 రోజుల ఉచిత డేటా ఇంజినీరింగ్ కోర్సు
కేసీఆర్పై ‘వెలుగు’ దుష్ప్రచారం.. 24 గంటల్లో క్షమాపణ చెప్పాలి: జర్మనీ బీఆర్ఎస్ డిమాండ్
పెళ్లయిన 45 రోజులకే భర్త హత్యకు ప్లాన్.. భార్య, ప్రియుడు సహా ముగ్గురు అరెస్ట్
Road Accident | థార్ కారు బీభత్సం.. బైక్ను ఢీకొని ఇద్దరు దుర్మరణం
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

