హైదరాబాద్, అక్టోబర్ 29 : ఎయిర్ కూలర్ల సంస్థ సింఫనీ ఆశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికపు కన్సాలిడేటెడ్ నికర లాభంలో 61 శాతం వృద్ధిని నమోదు చేసుకున్నది. జూలై-సెప్టెంబర్లో రూ.56 కోట్ల లాభాన్ని ఆర్జించింది. కన్సాలిడేటెడ్ ఆదాయం ఏడాది ప్రాతిపదికన 15 శాతం ఎగబాకి రూ.315 కోట్లకు చేరుకున్నట్లు కంపెనీ ఎండీ(కార్పొరేట్ వ్యవహారాలు) నృపేశ్ షా తెలిపారు. మరోవైపు, రూ.2 ముఖ విలువ కలిగిన ప్రతిషేరు రూ.2 మధ్యంతర డివిడెండ్ ప్రకటించింది.