Swiggy | ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్ స్విగ్గీ (Swiggy)కి మరో షాక్ తగిలింది. సంస్థ రెవెన్యూ అండ్ గ్రోత్ విభాగం సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అనూజ్ రాథీ రాజీనామా చేశారు. స్విగ్గీతో తన ఏడేండ్ల అనుబంధానికి గుడ్ బై చెప్పారు. ‘స్విగ్గీతో ఏడేండ్ల ప్రయాణం తర్వాత నా సొంత మార్గం కోసం వైదొలగాలని నిర్ణయించుకున్నా’ అని లింక్డ్ ఇన్ పోస్ట్‌లో పేర్కొన్నాడు. ఇది అద్భుతమైన ప్రయాణం, భారతీయుల సౌకర్యార్థం పని చేస్తున్న స్విగ్గీలో కొంత మంది మెరుగైన వ్యక్తులతో కలిసి పని చేయకపోతే నేను లక్కీ కాదు’ అని వ్యాఖ్యానించాడు.
ఈ ఏడాది ప్రారంభం నుంచి స్విగ్గీలో కీలక పదవుల్లో ఉన్న వారు రాజీనామా చేస్తున్నారు. గత ఏప్రిల్ నెలలో సంస్థ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ గా పని చేస్తున్న దాలేవేజ్ రాజీనామా చేశారు. ఆయన బాటలో స్విగ్గీ బ్రాండ్ ప్రొడక్ట్, మార్కెట్ అండ్ సస్టెయినబిలిటీ విభాగం వైస్ ప్రెసిడెంట్ లింగమనేని ఆశిష్.. గత మే నెలలో వైదొలిగారు. త్వరలో స్విగ్గీ ఐపీవో ద్వారా స్టాక్ మార్కెట్లలో లిస్టింగ్ కానున్న నేపథ్యంలో కీలక ఉద్యోగులు వైదొలగడం ఆసక్తికర పరిణామం.