Swiggy IPO | ఫుడ్ డెలివరీ అండ్ క్విక్ కామర్స్ మేజర్ ‘స్విగ్గీ’ ఐపీఓకు గురువారం రెండో రోజు కూడా 35 శాతం షేర్లకే సబ్ స్క్రిప్షన్లు వచ్చాయి. ఎన్ఎస్ఈ వెల్లడించిన డేటా ప్రకారం 16,09,703 షేర్లకు 5,56,98,652 షేర్లకు మాత్రమే బిడ్లు దాఖలయ్యాయి. రిటైల్ ఇన్వెస్టర్లు 84 శాతం బిడ్లు దాఖలు చేస్తే క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు 28 శాతం బిడ్లు ఫైల్ చేశారు. ఇక నాన్ ఇన్ స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు 14 శాతం సబ్ స్క్రిప్షన్లు చేశారు. మరోవైపు యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి రూ.5,085 కోట్ల నిధులు సేకరించినట్లు మంగళవారం స్విగ్గీ వెల్లడించింది.
బెంగళూరు కేంద్రంగా పని చేస్తున్న స్విగ్గీ ఐపీఓలో షేర్ విలువ రూ.371-390గా ప్రతిపాదించింది. ఐపీఓ ద్వారా రూ.11,327 కోట్ల నిధులు సేకరించాలని తలపెట్టింది. అందులో ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) ద్వారా రూ.6,828 కోట్లు, తాజాగా షేర్ల జారీ ద్వారా రూ.4,499 కోట్ల నిధులు సేకరించడం లక్ష్యంగా పెట్టుకున్నది. కోటక్ మహీంద్రా క్యాపిటల్ కంపెనీ, జేపీ మోర్గాన్ ఇండియా, సిటీ గ్రూప్ గ్లోబల్ మార్కెట్స్ ఇండియా, బీఓఎఫ్ఏ సెక్యూరిటీస్ ఇండియా, జెఫరీస్ ఇండియా, ఐసీఐసీఐ సెక్యూరిటీస్ అవెండస్ క్యాపిటల్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలు. .స్విగ్గీ ఐపీఓ మేనేజర్లుగా వ్యవహరిస్తున్నాయి.