న్యూఢిల్లీ, అక్టోబర్ 28: ఆహార, కిరాణా వస్తువుల డెలివరీ సంస్థ స్విగ్గీ స్టాక్ మార్కెట్లోకి లిస్ట్ కాబోతున్నది. వచ్చే నెల 6 నుంచి 8 వరకు మూడు రోజులపాటు జరగనున్న ఐపీవో ద్వారా గరిష్ఠంగా రూ.11,300 కోట్ల నిధులను సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నది.
ప్రైస్ బాండ్ ధరను రూ.371 నుంచి రూ.390 ధరల శ్రేణిలో నిర్ణయించింది. యాంకర్ పెట్టుబడిదారులకు నవంబర్ 5న వాటాలను విక్రయించనున్నది. ఈ నిధుల సేకరణలో రూ.4,500 కోట్లను తాజా షేర్లను జారీ చేయడం ద్వారా, మరో రూ.6,800 కోట్లను ఆఫర్ ఫర్ సేల్ రూట్లో సేకరించాలనుకుంటున్నది.