హైదరాబాద్, సెప్టెంబర్ 29: మహీంద్రాకు చెందిన స్వరాజ్ ..రాష్ట్ర మార్కెట్లోకి కొత్త హార్వెస్టర్‌ను విడుదల చేసింది. స్వరాజ్ ప్రో కంబైన్ 7060 పేరుతో విడుదల చేసిన ఈ హార్వెస్టర్.. వరి రైతులకు మెరుగైన ఉత్పాదకతను అందించనున్నది. వృథా తగ్గి ధాన్యం దిగుబడి పెరుగడానికి ఈ హార్వెస్ట్ దోహదం చేయనున్నదని కంపెనీ సీఈవో హరీశ్ చవాన్ తెలిపారు. నేలపై వాలిపోయిన వరి పంటను కూడా సమర్థంగా కట్ చేసే సామర్థ్యం కలిగిన ఈ హార్వెస్ట్.. ఇతర వాటితో పోలిస్తే దీనికి ఖర్చు కూడా తగ్గనున్నదని పేర్కొంది. ఈ హార్వెస్టర్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న స్వరాజ్ రిటైల్ అవుట్లెట్లలో లభించనున్నదన్నారు.