న్యూఢిల్లీ, ఏప్రిల్ 4: ప్రముఖ ద్విచక్ర వాహన సంస్థ సుజుకీ మోటర్‌సైకిల్… దేశీయ మార్కెట్లోకి మరో మాడల్‌ను తీసుకొచ్చింది. నూతన బర్గ్‌మ్యాన్ స్ట్రీట్ పేరుతో విడుదల చేసిన ఈ ఈ స్కూటర్ రెండు రకాల్లో లభించనున్నది. ఈ స్కూటర్ ప్రారంభ ధర రూ.1,01,944గా నిర్ణయించిన సంస్థ… గరిష్ఠంగా రూ.1,13,200కి విక్రయించనన్నది. ఈ ధరలు న్యూఢిల్లీ షోరూంనకు సంబంధించినవి.
2026 సంవత్సరానికిగాను విడుదల చేసిన ఈ మాడల్‌లో నూతన డ్యూయల్ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్స్, స్టోరేజ్‌ను 21.5 లీటర్ల నుంచి 24.6 లీటర్లకు పెంచింది. యూఎస్బీ చార్జింగ్, 4.2 ఇంచుల టీఎఫ్టీ , కీలెస్ సిస్టమ్, 124 సీసీ ఇంజిన్, సింగిల్ సిలిండర్ 8.2 బీహెచ్‌పీల శక్తినివ్వనున్నది. గంటకు 60 కిలోమీటర్ల వరకు వేగంతో ప్రయాణించనున్న ఈ స్కూటర్‌ను యువతను దృష్టిలో పెట్టుకొని పలు మార్పులు చేసింది.