Suzuki Jimny | జపాన్‌కు చెందిన సుజుకి మోటార్ కార్పొరేషన్ (Suzuki Motor Corporation) కీలక నిర్ణయం తీసుకుంది. గతేడాది భారత్‌లో ఆవిష్కరించిన 5-డోర్ జిమ్నీ (5-Door Jimny))కారును గత నెల 30న జపాన్ మార్కెట్లో విడుదల చేసింది. జిమ్నీ నొమాడే మానికర్ (Jimny Nomade Moniker) అనే పేరుతో ఆవిష్కరించిన జిమ్నీ (Jimny) కారు మీద జపాన్ పౌరులు మనస్సు పారేసుకున్నారు. ఏప్రిల్ మూడో తేదీ నుంచి కార్ల డెలివరీ ప్రారంభిస్తామని సుజుకి మోటార్ కార్పొరేషన్ (Suzuki Motor Corporation) ప్రకటించింది. జపాన్ మార్కెట్లో ఆవిష్కరించిన నాలుగు రోజుల్లోనే 50వేల బుకింగ్స్ నమోదయ్యాయి.
భారత్‌లో తయారు చేసిన జిమ్నీ (Jimny) కారును జపాన్‌కు దిగుమతి చేసుకుని డెలివరీ చేయాల్సి ఉంటుంది. ఫలితంగా బుక్ చేసుకున్న కారు డెలివరీకి ఎక్కువ సమయం పడుతుంది. వెయిటింగ్ పీరియడ్ పెరుగుతుండటంతో సుజుకి మోటార్ కార్పొరేషన్ (Suzuki Motor Corporation) తాత్కాలికంగా ఆఫ్ రోడ్ ఎస్యూవీ (Off Road SUV) కారు జిమ్నీ (Jimny) బుకింగ్స్ తాత్కాలికంగా నిలిపేసింది. బుకింగ్స్ ఎప్పుడు ప్రారంభిస్తారన్న సంగతి కూడా వెల్లడించలేదు. అంతే కాదు జపాన్‌లో జిమ్నీ(Jimny) కారు ప్రమోషనల్ కార్యక్రమాలను రద్దు చేసింది.
జపాన్‌లో 5-డోర్ జిమ్నీ కారు 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ వేరియంట్ ధర 26,51,000 యెన్లు (రూ.14.48 లక్షలు) పలుకుతుంది. ఇక ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ వేరియంట్ 27,50,000 యెన్లు (రూ.15.43 లక్షలు) పలుకుతుంది. భారత్ మార్కెట్లో రూ.12.74 లక్షల నుంచి (ఎక్స్ షోరూమ్) రూ.14.79 లక్షల (ఎక్స్ షోరూమ్) వరకూ పలకుతుందీ జిమ్నీ. భారత్‌లో మహీంద్రా థార్ రాక్స్ (Mahindra Thar Roxx), 5- డోర్ ఫోర్స్ గుర్ఖా (Force Gurkha Five Door) కార్లతో పోటీ పడుతుంది.
భారత్ మార్కెట్లో మారుతి సుజుకి జిమ్నీ (Maruti Suzuki Jimny) కారు 1.5 లీటర్ల కే15బీ ఫోర్ సిలిండర్ పెట్రోల్ ఇంజిన్‌తో వస్తోంది. ఈ ఇంజిన్ గరిష్టంగా 103 హెచ్‌పీ విద్యుత్, 134.2 ఎన్ఎం టార్క్ వెలువరిస్తుంది. 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ లేదా 4 – స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ వేరియంట్లలో లభిస్తుంది. మాన్యువల్ ట్రాన్స్మిషన్ వేరియంట్ లీటర్ పెట్రోల్‌పై 16.94 కి.మీ., ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ వేరియంట్ 16.39 కి.మీ మైలేజీ ఇస్తుంది.
మారుతి సుజుకి జిమ్నీ (Maruti Suzuki Jimny) సిక్స్ ఎయిర్ బ్యాగ్స్, ఏబీఎస్, ఈబీడీ, స్టెబిలిటీ కంట్రోల్, హిల్ హోల్డ్ అసిస్ట్, హిల్ డిసెంట్ కంట్రోల్, బ్రేక్ అసిస్ట్, రేర్ వ్యూ కెమెరా, సీట్ బెల్ట్ ప్రెటెన్షర్స్, ఇంజిన్ ఇమ్మొబిలైజర్ తదితర సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి.