Maruti Grand Vitara | మారుతి సుజుకి తన హైబ్రీడ్ ఎస్యూవీ మోడల్ కారు గ్రాండ్ విటారా ధర రూ.4000 పెంచేసింది. తాజా ధర పెంపుతో గ్రాండ్ విటారా రూ.18.29 లక్షల (ఎక్స్ షోరూమ్) నుంచి ప్రారంభం అవుతుంది. టాప్ హై ఎండ్ వేరియంట్ ధర రూ.18.29 లక్షలు (ఎక్స్ షోరూమ్) పలుకుతుంది. ఈ హైబ్రీడ్ ఎస్‌యూవీలో కొత్త సేఫ్టీ ఫీచర్ జత చేయడంతో ధర పెంచినట్లు తెలుస్తున్నది. గతేడాది సెప్టెంబర్‌లో దేశీయ మార్కెట్లో ఈ కారు ఆవిష్కరించింది.
ఈ ఏడాది మారుతి సుజుకి కార్ల ధరలు పెంచడం ఇది మూడోసారి. తొలుత జనవరి 16, తర్వాత ఏప్రిల్ ఒకటో తేదీన అన్ని మోడల్ కార్ల ధరలు 1.1 శాతం పెంచేసింది. ఇన్పుట్ కాస్ట్ పెరిగిపోవడంతో కార్ల ధరలు పెంచక తప్పడం లేదని మారుతి సుజుకి వెల్లడించింది.
గ్రాండ్ విటారా హైబ్రీడ్ ఎడిషన్ కారు అక్యౌస్టిక్ వెహికల్ అలర్టింగ్ సిస్టమ్ (అవాస్ Acoustic Vehicle Alerting System (AVAS)తో వస్తుంది. 6-ఎయిర్ బ్యాగ్స్ (ఫ్రంట్, సైడ్ అండ్ కర్టైన్), ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ (ఈఎస్పీ) విత్ హిల్ హోల్డ్ అసిస్ట్, 3-పాయింట్ ఈఎల్ఆర్ సీట్ బెల్ట్స్ (ఆల్ సీట్స్), ఫ్రంట్ అండ్ రేర్ డిస్క్ బ్రేక్స్, ఏబీఎస్ + ఈబీడీ, హిల్ డిస్కెంట్ కంట్రోల్, టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్ (టీపీఎంఎస్) వంటి ఫీచర్లు ఉంటాయి.
ఈ కారు 1.5 లీటర్ల డ్యుయల్ జెట్, డ్యుయల్ వీవీటీ మైల్డ్ హైబ్రీడ్ పెట్రోల్ ఇంజిన్ కలిగి ఉంటుంది. ఈ ఇంజిన్ 88 హెచ్‌పీ విద్యుత్, 121 ఎన్ఎం టార్చి వెలువరిస్తుంది. స్మార్ట్ హైబ్రీడ్ వేరియంట్ విత్ డ్యుయల్ బ్యాటరీ సెటప్, బ్రేక్ ఎనర్జీ రీ జనరేషన్, టార్చి అసిస్ట్, ఐడిల్ స్టాప్ అండ్ స్టార్ట్ ఫంక్షన్ ఫీచర్లు ఉన్నాయి.
మారుతి గ్రాండ్ విటారా ఇంటెలిజెంట్ ఎలక్ట్రిక్ హైబ్రీడ్ మోడల్ కారులో వాడే లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్‌పై 8 ఏండ్లు లేదా 1.60 లక్షల కి.మీ. వారంటీ అందిస్తుంది. గ్రాండ్ విటారా సీఎన్జీ వేరియంట్లోనూ ఈ ఇంజిన్ లభిస్తుంది. గ్రాండ్ విటారా సీఎన్జీ వేరియంట్ గరిష్టంగా 103 హెచ్‌పీ, 136 ఎన్ఎం టార్చి వెలువరిస్తుంది.
రెండు ఇంజిన్లు 5-స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్, 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ ఆప్షన్ కలిగి ఉంటాయి. సీఎన్జీ వేరియంట్ కారులో మాత్రం 5-స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ ఆప్షన్ ఉంటుంది. స్మార్ట్ హైబ్రీడ్ వేరియంట్ కారు ఈవీ, ఎకో, పవర్, నార్మల్ డ్రైవ్ మోడ్స్‌లో లభిస్తుంది.
గ్రాండ్ విటారా కారుతోపాటు సెల్ఫ్ చార్జ్ బ్యాటరీ, సన్‌రూఫ్ కూడా ఇస్తారు. స్మార్ట్ హైబ్రీడ్ ఎస్యూవీ.. పెట్రోల్ ఇంజిన్, ఎలక్ట్రిక్ మోటార్ జత చేశారు. బ్యాటరీ తనంతట తాను చార్జింగ్ అవుతుంది. సన్‌రూఫ్ సెషన్ తోపాటు వెంటిలేటెడ్ సీట్స్, మల్టీపుల్ డ్రైవింగ్ మోడ్స్ ఉంటాయి.
ఏడంగుళాల మల్టీ ఇన్ఫోటైన్ మెంట్ డిస్ ప్లే, హిల్ హోల్డ్ అసిస్ట్, రేర్ డిస్క్ బ్రేక్, టీపీఎంఎస్ వంటి ఫీచర్లు ఉంటాయి. వైర్లెస్ చార్జర్‌తోపాటు సుజుకి కనెక్ట్ వంటి ఫీచర్లు కూడా జత చేశారు.