హైదరాబాద్, డిసెంబర్ 7: రాష్ర్టానికి చెందిన సువెన్ ఫార్మాస్యూటికల్..అమెరికా కేంద్రస్థానంగా కార్యకలాపాలు అందిస్తున్న ఎన్జే బియో ఇండస్ట్రీలో మెజార్టీ వాటాను కొనుగోలు చేయబోతున్నది. 64.4 మిలియన్ డాలర్లతో(రూ.500 కోట్లకు పైమాటే) ప్రింజెక్షన్, ఎన్జే బియోలో 56 శాతం వాటాను కొనుగోలు చేస్తున్నట్లు సంస్థ బీఎస్ఈకి సమాచారం అందించింది.
ఈ లావాదేవీ ఏడీసీ వంటి అభివృద్ధి చెందుతున్న పద్దతుల్లో ఎండ్-టు-ఎండ్ సొల్యూషన్లను అందించే టెక్నాలజీకి అనుగుణంగా ఉన్నదని సువెన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ వివేక్ శర్మ తెలిపారు. ఈ ఒప్పందం ఈ నెల చివరినాటికి పూర్తికాగలదన్న విశ్వాసాన్ని వ్యక్తంచేశారు.