Suresh Raina – Kia Carnival | టీం ఇండియా మాజీ క్రికెటర్ సురేష్ రైనాకు కియా మోటార్స్ ఎంపీవీ కారు ఆల్ న్యూ కియా కార్నివాల్ లిమౌసిన్ డెలివరీ చేసింది. దీంతో న్యూ జనరేషన్ లగ్జరీ ఎంపీవీ కారుకు మొదటి యజమాని అయ్యారు సురేష్ రైనా. న్యూ కియా కార్నివాల్ లిమౌసైన్ కారు ధర రూ.63.90 లక్షలు పలుకుతుంది. పాత మోడల్ కియా కార్నివాల్ కారు కంటే దాదాపు రూ.30 లక్షలు ఎక్కువ పలుకుతుంది. న్యూ కార్నివాల్ లిమౌసిన్ కారుకు సమీపంలో పోటీ పడే ఎంపీవీ కార్లు లేనే లేకపోవడం ఆసక్తి కర పరిణామం. టయోటా ఇన్నోవా హైక్రాస్, ఆల్ట్రా లగ్జరియస్ టయోటా వెలిఫైర్ కార్ల ధరలు రూ.1.22 కోట్ల పై చిలుకే పలుకుతాయి. అంటే టయోటా ఇన్నోవా హైక్రాస్, టయోటా వెలిఫైర్ కార్లతో పోలిస్తే కార్నివాల్ లిమౌనైస్ చాలా ఎకానమికల్.
ఫ్యూషన్ బ్లాక్ తోపాటు గ్లాసియర్ వైట్ పెరల్ ఎక్స్ టీరియర్ రంగు గల కారును సురేష్ రైనా ఎంచుకున్నాడు. ఈ కారు 2.2 లీటర్ల డీజిల్ ఇంజిన్. ఇది గరిష్టంగా 191 బీహెచ్పీ విద్యుత్, 441 ఎన్ఎం టార్క్ వెలువరిస్తుంది. 8-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఆప్షన్‌తో పని చేస్తుంది. సెవెన్ సీట్లతో డ్రైవర్, ప్రయాణికులకు మరింత సౌకర్యవంతంగా, లగ్జరియస్‌గా ఉంటుంది. డ్యుయల్ 12.3 అంగుళాల డిస్ ప్లేలు, బోస్ ప్రీమియం ఆడియో, వెంటిలేటెడ్ సీట్లు, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ, సేఫ్టీ విస్తరణకు అడాస్ ఫీచర్లు ఉంటాయి.
కియా కార్నివాల్ లిమౌనైస్ రెండో వరుస సీట్లు పవర్డ్ కెప్టెన్ సీట్స్ విత్ హీటింగ్, వెంటిలేషన్, లెగ్ ఎక్స్టెన్షన్ ఫెసిలిటీస్ కలిగి ఉంటుంది. ఎలక్ట్రానికల్లీ కంట్రోల్డ్ స్లైడింగ్ రేర్ డోర్లు ఉంటాయి. సేఫ్టీ కోసం 8-ఎయిర్ బ్యాగ్స్, ఫోర్ డిస్క్ బ్రేకులు, 360-డిగ్రీ కెమెరా, టైర్ ప్రెషర్ మానిటరింగ్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, లేన్ కీపింగ్ అసిస్ట్, త్రీ జోన్ క్లైమేట్ కంట్రోల్, పెడల్ షిఫ్టర్లు ఉంటాయి. ఎకో, నార్మల్, స్పోర్ట్, స్మార్ట్ మోడ్స్‌లో కియా కార్నివాల్ లిమౌనైస్ లభిస్తుంది. దీనిపై కస్టమర్లకు మూడేండ్ల వారంటీ, కంప్లిమెంటరీ మెయింటెనెన్స్, రోడ్ సైడ్ అసిస్టెన్స్ అందిస్తుంది కియా మోటార్స్.