Supreme Court | టెలికాం కంపెనీలకు ‘సుప్రీం’లో ఎదురుదెబ్బ.. ఏజీఆర్‌పై పిటిషన్లను కొట్టివేసిన సీజేఐ ధర్మాసనం
Supreme Court | టెలికాం కంపెనీలకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. అడ్జస్టెడ్ గ్రాస్ రెవెన్యూ (AGR)లో బకాయిల గణనలో తప్పులను సరిదిద్దాలంటూ వొడాఫోన్ ఐడియా, భారతీ ఎయిర్టెల్ సహా పలు కంపెనీలు దాఖలు చేసిన పిటిషన్లను సర్వోన్నత న్యాయస్థానం కొట్టివేసింది.
Supreme Court | టెలికాం కంపెనీలకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. అడ్జస్టెడ్ గ్రాస్ రెవెన్యూ (AGR)లో బకాయిల గణనలో తప్పులను సరిదిద్దాలంటూ వొడాఫోన్ ఐడియా, భారతీ ఎయిర్టెల్ సహా పలు కంపెనీలు దాఖలు చేసిన పిటిషన్లను సర్వోన్నత న్యాయస్థానం కొట్టివేసింది. టెలికాం కంపెనీల పిటిషన్‌ను చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ బీఆర్ గవాయ్‌లతో కూడిన ధర్మాసనం కొట్టివేసింది. క్యూరేటివ్ పిటిషన్లను ఓపెన్ కోర్టులో విచారించేందుకు జాబితా చేయాలని కంపెనీలు కోరాయి. క్యురేటివ్ పిటిషన్ అనేది సుప్రీంకోర్టులో చివరి ప్రయత్నం.. ఆ తర్వాత కోర్టును ఆశ్రయించడానికి చట్టపరమైన మార్గం ఉండదు. సాధారణంగా ఇలాంటి పిటిషన్స్‌ని న్యాయమూర్తులు ఛాంబర్లో పరిశీలించి.. విచారణకు అర్హత ఉందో.. లేదో నిర్ణయిస్తారు.
ప్రత్యేకంగా అభ్యర్థలు ఉంటే ఓపెన్ కోర్టులో విచారణకు అనుమతిస్తారు. క్యూరేటివ్ పిటిషన్లను ఓపెన్ కోర్టులో లిస్ట్ చేయాలన్న పిటిషన్లను ధర్మాసనం కొట్టివేసింది. గత ఏడాది అక్టోబర్ 9న కొన్ని టెలికాం కంపెనీల వాదనలను సుప్రీంకోర్టు పరిగణనలోకి తీసుకుంది. ఇందులో, సర్దుబాటు చేసిన స్థూల రెవెన్యూ (AGR) బకాయిల సమస్యపై వారి పిటిషన్స్ను జాబితా చేయాలని టెలికం కంపెనీలు కోరాయి. ఏజీఆర్ బకాయిల డిమాండ్‌లో లోపాలను సరిదిద్దాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను ఇంతకు ముందు జూలై 2021లో కోర్టు తిరస్కరించింది. ఏజీఆర్ బకాయిలను నిర్ణయించడంలో అనేక లోపాలున్నాయని.. మొత్తం రూ.లక్షకోట్లకుపైగా ఉన్నాయంటూ టెలికాం కంపెనీలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

