న్యూఢిల్లీ, ఏప్రిల్ 21: ఈ ఏడాది జనవరి-మార్చిలో దేశీయ ఆఫీస్ స్పేస్ మార్కెట్‌ను సరఫరా సమస్యలు దెబ్బతీశాయి. హైదరాబాద్ సహా దేశంలోని 8 ప్రధాన నగరాల్లో డిమాండ్‌కు తగ్గ సైప్లె లేక కార్యాలయ స్థలాల లీజింగ్ నికరంగా 24 శాతం తగ్గుముఖం పట్టినట్టు ఓ తాజా నివేదికలో రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ కుష్మన్ అండ్ వేక్ఫీల్డ్ (సీఅండ్‌డబ్ల్యూ) పేర్కొన్నది.
ఢిల్లీ-ఎన్సీఆర్, ముంబై, బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, పుణె, కోల్‌కతా, అహ్మదాబాద్‌లలోని ఆఫీస్ స్పేస్ లీజింగ్ ట్రెండ్‌పై సీఅండ్‌డబ్ల్యూ ఈ రిపోర్టు ఇచ్చింది. గత ఏడాది జనవరి-మార్చిలో 15.08 మిలియన్ చదరపు అడుగుల లీజింగ్ జరిగితే ఈ ఏడాది 11.51 మిలియన్ చ.అడుగులుగానే ఉన్నది.