హైదరాబాద్,డిసెంబర్ 3: దక్షిణాదికి చెందిన ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ సుమధుర గ్రూపు..తాజాగా హైదరాబాద్‌లో లగ్జరీ ప్రాజెక్టు పలైస్ రాయల్‌ను అభివృద్ధి చేస్తున్నది. ఈ విలాసవంతమైన ప్రాజెక్టు ద్వారా రూ.2,500 కోట్ల ఆదాయం సమకూరవచ్చునని తెలిపింది. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌కు సమీపంలో నిర్మించతలపెట్టిన పలైస్ రాయల్ ప్రాజెక్టును 7.35 ఎకరాల స్థలంలో ఏర్పాటు చేస్తున్నది. మూడు విభాగాల్లో నిర్మిస్తున్న ఈ 52 అంతస్తుల ఎత్తైన టవర్‌లో 4 లేదా 5 పడక గదులు కలిగిన 523 యూనిట్లను నెలకొల్పుతున్నది. ప్రస్తుతం నిర్మాణాలు ప్రారంభించిన ఈ ప్రాజెక్టును 2029 నాటికి అందుబాటులోకి తీసుకురానున్నట్లు సుమధుర గ్రూపు సీఎండీ మధుసూధన్ తెలిపారు.