హైదరాబాద్, మార్చి 16: హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ ఔషధ సంస్థ భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ కో-ఫౌండర్, జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ సుచిత్రా కే ఎల్లా..భారత పరిశ్రమల సమాఖ్య(సీఐఐ) సదరన్ రీజియన్ చైర్‌పర్సన్‌గా నియమితులయ్యారు. 2022-23 ఆర్థిక సంవత్సరానికిగాను కొత్త కార్యావర్గాన్ని బుధవారం ప్రకటించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికిగాను డిప్యూటీ చైర్మన్‌గా వ్యవహరించారు. అలాగే 2012-13లో సీఐఐ ఏపీ చైర్‌పర్సన్‌గా పనిచేశారు కూడా. అలాగే వొల్వో గ్రూపు ఇండియా ప్రెసిడెంట్, ఎండీ కమల్ బాలీ సీఐఐ సదరన్ డిప్యూటీ చైర్మన్‌గా ఎన్నికయ్యారు.