Sensex | ఒకవైపు కరోనా న్యూవేరియంట్ ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నాయి. అయినప్పటికీ కొత్త సంవత్సరం 2022 తొలివారం దేశీయ స్టాక్ మార్కెట్లకు శుభారంభాన్నిచ్చింది. శుక్రవారం (2022, జనవరి 7)తో ముగిసిన వారంలో బీఎస్ఈ ఇండెక్స్ సెన్సెక్స్ 2.6 శాతం లబ్ధి పొందింది. 2012లో 2.7 శాతం గెయిన్ తర్వాత ఇదే ఫస్ట్ టైం. శుక్రవారం ట్రేడింగ్లో 143 పాయింట్లు లాభపడి 59,745 పాయింట్ల వద్ద ముగిసింది. మరోవైపు ఎన్ఎస్ఈ సూచీ నిఫ్టీ కూడా 67 పాయింట్ల లబ్ధితో 17,812 పాయింట్ల వద్ద స్థిర పడింది.
స్టాక్ మార్కెట్లు శుభారంభాన్నివ్వడంతో థర్డ్ వేవ్ కేసుల మధ్య దేశ ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుందని ఇన్వెస్టర్లు ఆశాభావంతో ఉన్నారు. ఒకవైపు, కేసులు పెరుగుతున్నా.. మరోవైపు అమెరికా ఫెడ్ రిజర్వు ఊహించినదాని కంటే ముందే కీలక వడ్డీరేట్లు పెంచుతామని ప్రకటించడంతో తొలుత స్క్రిప్టుల్లో అనిశ్చితి నెలకొన్నా.. తర్వాత వారాంతంలో లాభాలతో ముగిసాయి.