Stock Market | దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. గురువారం భారీ నష్టాల్లో ముగిసిన మార్కెట్లు శుక్రవారం భారీగా పెరిగాయి. అమెరికా బాండ్లపై రాబడులు తగ్గడం కలిసివచ్చింది. ఐటీ, ఎఫ్ఎంసీజీ, ఫైనాన్షియల్, బ్యాంకింగ్ రంగాల షేర్లు రాణించడంతో మార్కెట్లు భారీగా పెరిగాయి. క్రితం సెషన్‌తో పోలిస్తే సెన్సెక్స్.. 80,897.00 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. ఇంట్రాడేలో 80,897.00 పాయింట్ల కనిష్టానికి చేరిన సెన్సెక్స్.. గరిష్టంగా 81,905.17 పాయింట్లు పెరిగింది.
చివరకు 769.09 పాయింట్లు పెరిగి.. 81,721.08 వద్ద స్థిరపడింది. ఇక నిఫ్టీ 243.45 పాయింట్లు లాభపడి.. 24,853.15 వద్ద ముగిసింది. ఎటర్నల్, పవర్‌గ్రిడ్, ఐటీసీ, బజాజ్ ఫిన్సర్వ్, పవర్‌గ్రిడ్ కార్పొరేషన్, ఎస్బీఐ లెఫ్ ఇన్సురెన్స్, నెస్లే, అదానీ పోర్ట్స్, యాక్సిస్ బ్యాంక్, ట్రెండ్ లాభాల్లో ముగిశాయి. ఇక సన్‌ఫార్మా, గ్రాసిమ్ నష్టాల్లో ముగిశాయి. నిఫ్టీ ఎఫ్ఎంసీజీ 1.6 శాతం, నిఫ్టీ ప్రైవేట్ బ్యాంక్, నిఫ్టీ ఐటీ ఒక్కొక్కటి ఒకశాతం పెరిగాయి. బ్యాంక్ 0.8 శాతం, మెటల్, పీఎస్‌యూ బ్యాంక్, 0.7 శాతం నుంచి 0.5 శాతం వరకు పెరిగాయి. ఫార్మా మాత్రమే 0.4 శాతం పడిపోయింది.