ముంబై, నవంబర్ 24 : లాభాల్లో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు చివర్లో నష్టాల్లోకి జారుకున్నాయి. చివరి అరగంటలో మదుపరులు అమ్మకాలకు మొగ్గుచూపడం, ఎఫ్ఐఐలు నిధులను తరలించుకుపోవడంతో సెన్సెక్స్ 85 వేలు, నిఫ్టీ 26 వేల పాయింట్ల కీలక మైలురాయిని కోల్పోయాయి.
ఇంట్రాడేలో 500 పాయింట్లకు పైగా నష్టపోయిన సెన్సెక్స్ చివరకు 331.21 పాయింట్లు కోల్పోయి 84,900.71 వద్ద, నిఫ్టీ కూడా 108.65 పాయింట్లు నష్టపోయి 25,959.50 వద్ద నిలిచింది.