ముంబై, సెప్టెంబర్ 3: దేశీయ స్టాక్ మార్కెట్ల వరుస నష్టాలకు బ్రేక్‌పడింది. మెటల్, జీఎస్టీ రేట్ల తగ్గింపుపై కౌన్సిల్ సమావేశం ప్రారంభం కావడం మదుపరుల్లో ఉత్సాహాన్ని నింపింది. ఫలితంగా ఒక దశలో 700 పాయింట్ల వరకు లాభపడిన 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ చివరకు 409.83 పాయింట్లు అందుకొని 80,567.71 వద్ద ముగిసింది. మరో సూచీ నిఫ్టీ 135.45 పాయింట్లు అందుకొని 24,715.05 వద్ద స్థిరపడింది. మార్కెట్లో టాటా స్టీల్ 5.90 శాతం పెరిగి టాప్ గెయినర్‌గా నిలిచింది. దీంతోపాటు టైటాన్, మహీంద్రా అండ్ మహీంద్రా, ఐటీసీ, ఎటర్నల్, ఎస్బీఐ, ట్రెంట్, టాటా మోటర్స్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, సన్‌ఫార్మా, కొటక్ బ్యాంక్, ఎల్అండ్టీ, బీఈఎల్, మారుతి, రిలయన్స్, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్‌సీఎల్ టెక్నాలజీ, అల్ట్రాటెక్ సిమెంట్ షేర్లు లాభాల్లో ముగిశాయి. కానీ, ఇన్ఫోసిస్, ఎన్టీపీసీ, హెచ్‌యూఎల్, టీసీఎస్, భారతీ ఎయిర్టెల్, టెక్ మహీంద్రా, యాక్సిస్ బ్యాంక్ షేర్లు నష్టపోయాయి. అత్యధికంగా మెటల్ రంగ సూచీ 3.08 శాతం ఎగబాకింది. దీంతోపాటు కమోడిటీస్ 1.53 శాతం, హెల్త్‌కేర్ 1.20 శాతం, కన్జ్యూమర్ డ్యూరబుల్, ఆర్థిక సేవలు, బ్యాంకింగ్, వాహన రంగ షేర్లకు మదుపరుల నుంచి మద్దతు లభించింది. ఐటీ, టెక్నాలజీ రంగ షేర్లు నష్టపోయాయి.