ముంబై, ఆగస్టు 11: దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండోరోజూ నష్టాలకే పరిమితమైయ్యాయి. శుక్రవారం బాంబే స్టాక్ ఎక్సేంజ్ ప్రధాన సూచీ సెన్సెక్స్ 365.53 పాయింట్లు లేదా 0.56 శాతం క్షీణించి 65,322.65 వద్ద నిలిచింది. ఒకానొక దశలో 413.57 పాయింట్లు కోల్పోవడం గమనార్హం.
నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ సూచీ నిఫ్టీ సైతం 114.80 పాయింట్లు లేదా 0.59 శాతం పడిపోయి 19,428.30 వద్ద స్థిరపడింది. బ్యాంకింగ్, ఎఫ్ఎంసీజీ, ఫార్మా రంగాల షేర్లలో అమ్మకాల ఒత్తిడి సూచీలను దెబ్బతీసింది. బ్యాంకింగ్ వ్యవస్థలో మిగులు నగదు నిల్వలను తాజా ద్రవ్యసమీక్షలో ఆర్బీఐ తీసుకోవడం మదుపరులకు రుచించలేదని అంటున్నారు.