శుక్రవారం 29 మే 2020
Business - Mar 31, 2020 , 17:20:48

లాభాల్లో ముగిసిన స్టాక్‌మార్కెట్లు

 లాభాల్లో ముగిసిన స్టాక్‌మార్కెట్లు

దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. కరోనా ప్ర‌భావం ఉన్నా కూడా మ‌దుప‌ర్లు భారీ కొనుగోళ్ల‌కే మొగ్గుచూపారు. దీంతో సెన్సెక్స్ 1,028 పాయింట్ల లాభప‌డి 29,468 ద‌గ్గ‌ర ముగిసింది. ఇక నిఫ్టీ 317 పాయింట్ల లాభంతో 8,597 వ‌ద్ద క్లోజ్ అయింది. మెటల్స్, పీఎస్‌ఈ, ఆయిల్ అండ్ గ్యాస్ రంగాల్లోని షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. బీపీసీఎల్‌, బ్రిటానియా, రిల‌య‌న్స్‌, గెయిల్‌, ఐటీసీ , ఓఎన్జీసీ, హిందాల్కో, టెక్ మ‌హీంద్రా, విప్రో షేర్లు లాభప‌డ‌గా... ఇండ‌స్ఇండ్ బ్యాంక్‌, సిప్లా, ఐచర్ మోటార్స్‌, బ‌జాజ్‌ ఫిన్‌స‌ర్వ్‌, జీ ఎంట‌ర్‌టైన్ షేర్లు న‌ష్టాల్లో ముగిశాయి. మరోవైపు డాలరు మారకంలో లాభపడిన దేశీయ కరెన్సీ రూ. 75.51 వద్ద  వుంది


logo