ముంబై, ఆగస్టు 5 : దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం నష్టపోయాయి. ద్రవ్యసమీక్ష, ట్రంప్ సుంకాల ప్రభావం కనిపించింది. దీంతో సెన్సెక్స్ 308.47 పాయింట్లు దిగజారి 80,710.25 వద్ద ముగిసింది. నిఫ్టీ 73.20 పాయింట్లు కోల్పోయి 24,649.55 వద్ద స్థిరపడింది.
చమురు-గ్యాస్, బ్యాంకింగ్ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ షేర్లు డీలా పడ్డాయి.