Stock Market Close | దేశీయ స్టాక్ మార్కెట్లు మరోసారి జీవితకాల గరిష్ఠానికి చేరాయి. సెన్సెక్స్ తొలిసారిగా 74వేల మార్క్‌ను దాటింది. అదే సమయంలో నిఫ్టీ సైతం తొలిసారిగా సరికొత్తగా రికార్డు స్థాయిలో ఆల్‌టైమ్ హైకి చేరింది. కిత్రం సెషన్‌తో పోలిస్తే బుధవారం ఉదయం స్టాక్ మార్కెట్లు నష్టాల్లో మొదలయ్యాయి. ఆ తర్వాత కొద్దిసేపటికే సూచీలు కోలుకొని లాభాల్లోకి వెళ్లాయి. చివరి వరకు అదే జోరును కొనసాగించాయి. సెన్సెక్స్ ఉదయం 73,587.70 పాయింట్ల వద్ద నష్టాల్లో మొదలైంది. ఒక దశలో 73,321.48 పాయింట్ల కనిష్ఠానికి చేరిన సెన్సెక్స్.. ఇంట్రాడేలో 74,151.27 పాయింట్ల గరిష్ఠానికి చేరుకొని సరికొత్త రికార్డును నెలకొల్పింది. చివరకు 408.86 పాయింట్ల లాభంతో 74,085.99 పాయింట్ల వద్ద ముగిసింది.
నిఫ్టీ సైతం కిత్రం సెషన్‌తో పోలిస్తే నష్టాల్లోనే మొదలైంది. 22,327.50 పాయింట్ల వద్ద నష్టాల్లో ప్రారంభం కాగా.. ఒక దశలో 22,224.35 పాయింట్లకు పడిపోయింది. ఆ తర్వాత 22,497.20 పాయింట్ల గరిష్ఠాన్ని నమోదు చేసి తొలిసారిగా జీవితకాల గరిష్ఠానికి పెరిగింది. చివరకు 22,497.20 పాయింట్ల లాభంతో 22,474.05 వద్ద స్థిరపడింది. ట్రేడింగ్‌లో దాదాపు 508 షేర్లు పురోగమించగా, 2820 షేర్లు క్షీణించాయి మరియు 53 షేర్లు మారలేదు. నిఫ్టీలో బజాజ్ ఆటో, కోటక్ మహీంద్రా బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, భారతీ ఎయిర్టెల్ మరియు ఎస్బిఐ లైఫ్ ఇన్సూరెన్స్ టాప్ లాభపడగా, అదానీ ఎంటర్ప్రైజెస్, అల్ట్రాటెక్ సిమెంట్, ఎన్టీపీసీ, ఓఎన్జీసీ, బీపీసీఎల్ నష్టపోయాయి.
సెక్టార్లలో బ్యాంక్ ఇండెక్స్ 1 శాతం, ఫార్మా, ఐటీ సూచీలు 0.7 శాతం చొప్పున పెరిగాయి. మరోవైపు చమురు, గ్యాస్, పవర్, రియాల్టీ 1 శాతం చొప్పున క్షీణించాయి. బీఎస్ఈ మిడ్‌క్యాప్ ఇండెక్స్ 0.6 శాతం, స్మాల్ క్యాప్ ఇండెక్స్ 2 శాతం క్షీణించాయి. ట్రేడింగ్‌లో దాదాపు 508 షేర్లు పురోగమించగా.. 2,820 షేర్లు క్షీణించాయి. మరో 53 షేర్లు మాత్రం మారలేదు. నిఫ్టీలో బజాజ్ ఆటో, కోటక్ మహీంద్రా బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, భారతీ ఎయిర్టెల్, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ లాభపడ్డాయి. అదానీ ఎంటర్ప్రైజెస్, అల్ట్రాటెక్ సిమెంట్, ఎన్టీపీసీ, ఓఎన్జీసీ, బీపీసీఎల్ నష్టపోయాయి. బ్యాంక్ ఇండెక్స్ ఒకశాతం, ఫార్మా, ఐటీ సూచీలు 0.7 శాతం చొప్పున పెరిగాయి. మరోవైపు చమురు, గ్యాస్, పవర్, రియాల్టీ ఒకశాతం చొప్పున పతనమయ్యాయి. బీఎస్ఈ మిడ్‌క్యాప్ ఇండెక్స్ 0.6 శాతం, స్మాల్ క్యాప్ ఇండెక్స్ 2శాతం పడిపోయాయి.