Stock Market Close | దేశీయ స్టాక్ మార్కెట్లు మరోసారి జీవితకాల గరిష్ఠానికి చేరాయి. ముగింపులో తొలిసారిగా రికార్డు స్థాయిలో ముగిశాయి. తొలిసారిగా నిఫ్టీ 26వేల పాయింట్ల ఎగువన ముగిసింది. బుధవారం ఉదయం మార్కెట్లు ఫ్లాట్‌గా మొదలయ్యాయి. చివరి సెషన్లో మెటల్, మీడియా, ఎనర్జీ రంగాల షేర్ల మద్దతుతో లాభాల్లో ముగిశాయి. ఉదయం సెన్సెక్స్ పాయింట్ల వద్ద ఫ్లాట్‌గా మొదలైంది. ఆ తర్వాత సూచీలు ఒడిదొడుకులను ఎదుర్కొన్నాయి. ఇంట్రాడేలో 84,743.04 పాయింట్ల కనిష్ఠానికి చేరిన సెన్సెక్స్.. అత్యధికంగా 85,247.42 పాయింట్లకు పెరిగింది.
చివరకు 255.83 పాయింట్ల లాభంతో 85,169.87 పాయింట్ల వద్ద రికార్డు స్థాయిలో ముగిసింది. నిఫ్టీ 63.75 పాయింట్ల లాభంతో 26,004.15 వద్ద స్థిరపడింది. మొదటిసారిగా నిఫ్టీ 26పాయింట్ల ఎగువన ముగిసింది. నిఫ్టీలో పవర్ గ్రిడ్ కార్ప్, ఎన్టీపీసీ, యాక్సిస్ బ్యాంక్, గ్రాసిమ్ ఇండస్ట్రీస్, బజాజ్ ఫిన్సర్వ్ టాప్ గెయినర్స్‌గా నిలిచాయి. ఎల్‌టీఐఎండ్‌ట్రీ, టెక్ మహీంద్రా, టాటా కన్స్యూమర్, టాటా మోటార్స్, టైటాన్ కంపెనీ నష్టపోయాయి. బీఎస్ఈలో మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ సూచీలు 0.5 శాతం చొప్పున పతనమయ్యాయి. పవర్, మెటల్, మీడియా, రియల్టీ సూచీలు 0.5-3 శాతం వరకు పెరిగాయి. ఎఫ్ఎంసీజీ, పీఎస్‌యూ బ్యాంక్, ఐటీ 0.5-1 శాతం వరకు తగ్గాయి.