హైదరాబాద్, ఆగస్టు 8(నమస్తే తెలంగాణ): ఇనుప ఖనిజ ఉత్పత్తిలో అగ్రగామి సంస్థ ఎన్ఎండీసీ నూతన లోగోను కేంద్ర స్టీల్, పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాధిత్యా సింధియా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..వరుసగా రెండేండ్లుగా 40 మిలియన్ టన్నుల చొప్పున రికార్డు స్థాయి ఉత్పత్తిని నమోదు చేసిన సంస్థ, భవిష్యత్తులో మెరుగైన పనితీరు కనబరిచే అవకాశం ఉందన్నారు. ఇతర దేశాలపై ఆధారపడకుండా దేశం స్వయం సమృద్ధి సాధించడంలో ఎన్ఎండీసీ పాత్ర మరువరానిదని ఆయన చెప్పారు.