ముంబై, నవంబర్ 4: ప్రభుత్వరంగ సంస్థ బ్యాంక్ ఆఫ్ ఇండియా(బీవోఐ) నిరాశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. సెప్టెంబర్‌తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను బ్యాంక్ రూ.960 కోట్ల పన్నులు చెల్లించిన తర్వాత నికర లాభాన్ని గడించింది. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.1,051 కోట్ల లాభంతో పోలిస్తే 8.7 శాతం తగ్గినట్లు పేర్కొంది.
ఆపరేటింగ్ ప్రాఫిట్ 26 శాతం ఎగబాకి రూ.3,374 కోట్లకు చేరుకున్నది.
నికర వడ్డీ ఆదాయం ఏడాది ప్రాతిపదికన 44 శాతం అధికమై రూ.5,083 కోట్లకు చేరింది.
స్థూల నిరర్థక ఆస్తుల విలువ 12 శాతం(రూ.50,270 కోట్లు) నుంచి 8.51 శాతానికి (రూ.42,014 కోట్లు) తగ్గినట్లు పేర్కొంది.
ఏడాది క్రితం 2.79 శాతంగా(రూ.10,576 కోట్లు) ఉన్న నికర ఎన్పీఏ గత త్రైమాసికానికిగాను 1.92 శాతానికి(రూ.8,836 కోట్లు) దిగొచ్చింది.
బ్యాంక్ ఎన్ఐఎం 2.42 శాతం నుంచి 3.04 శాతానికి చేరింది.
బ్యాంక్ అడ్వాన్స్‌లు రూ.6,510 కోట్ల నుంచి రూ.8,130 కోట్లకు పెరిగాయి.
బ్యాంక్ ప్రొవిజన్ కవరేజ్ రేషియో 88.96 శాతంగా ఉన్నది.