పెండింగ్ పనులకు మోక్షం కలిగేనా?
హైదరాబాద్, జనవరి 30 (నమస్తే తెలంగాణ) : రైల్వే బడ్జెట్లో రాష్ర్టానికి తీవ్ర అన్యాయం జరుగుతున్నది. గడిచిన కొన్నేండ్లుగా అరకొర నిధులను కేటాయించి మోదీ సర్కార్ చేతులు దులుపుకొంటున్నది. ఇదే క్రమంలో వచ్చే ఆర్థిక సంవత్సరానికిగాను ఆదివారం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న సార్వత్రిక బడ్జెట్లోనూ కొత్త ప్రాజెక్టులపై సర్వత్రా ఉత్కంఠ నెలకొన్నది. గత కొన్నేండ్లుగా పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్తో పోలిస్తే తెలంగాణకు తక్కువగా నిధులు, ప్రాజెక్టులు కేటాయించి మోదీ సర్కార్ మొండిచెయ్యి చూపిస్తున్నది. ఈసారి కూడా భంగపాటు తప్పేలా లేదనిపిస్తున్నది. రాష్ట్రం నుంచి ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నప్పటికీ..నిధులు, ప్రాజెక్టులు తీసుకురావడంలో విఫలమవుతున్నారు. గతేడాది బడ్జెట్లో ఏపీకి రూ.9,417 కోట్ల నిధులు కేటాయిస్తే, తెలంగాణకు మాత్రం రూ. 5,337 కోట్లు కేటాయించి చేతులు దులుపుకొన్నది. 2023-24 నుంచి నిధుల కేటాయింపులో రాష్ర్టానికి తీవ్ర అన్యాయం చేస్తున్న మోదీ సర్కార్.