న్యూఢిల్లీ, మే 24: బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) గృహ కొనుగోలుదారులకు షాకిచ్చింది. ఎక్స్టర్నల్ బెంచ్మార్క్ లెండింగ్ రేటుతో అనుసంధానమైన గృహ రుణాలపై వడ్డీరేటును 40 బేసిస్ పాయింట్లు పెంచింది.
దీంతో వడ్డీరేటు 6.65 శాతం నుంచి 7.05 శాతానికి చేరుకోనున్నది. సవరించిన వడ్డీరేట్లు జూన్ 1, 2022 నుంచి అమలులోకి రానున్నట్లు తెలిపింది. అలాగే రెపోతో అనుసంధానమైన రుణాలపై వడ్డీరేటును మాత్రం 6.25 శాతంగా ఉంచింది. గతవారంలో బ్యాంక్ ఎంసీఎల్ఆర్ లింక్డ్ రుణాలపై వడ్డీరేటును 10 బేసిస్ పాయింట్లు పెంచిన విషయం తెలిసిందే.